NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. ఆయన చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్ లోని ఓ ప్రముఖ అనుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ముషారఫ్ కుటుంబ సభ్యులు దృవీకరించినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడించాయి.

Musharaf

 

ఆయన 1943 ఆగస్టు 11న ఢిల్లీలో జన్మించారు. ఆయన బాల్యంలో కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ లో చదివారు. ఆ తర్వాత లాహోర్ లోని ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజీలో ఉన్నత చదువులు చదివారు. ఆ తర్వాత బ్రిటన్ లోని రాయల్ కాలేజీ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ లో చదివారు. 1961 లో పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ లో చేరారు. పాకిస్థాన్ ఆర్మీలో 1964లో చేరారు.  జనరల్ పర్వేజ్ ముషారఫ్ 1998 నుండి 2007 వరకూ పాకిస్థాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. 1998 నుండి 2001 వరకు చైర్మన్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీగా వ్యవహరించారు. 1999 లో ఫెడరల్ ప్రభుత్వాన్ని సైన్యం కూల్చేసింది. ముషారఫ్ 2001 జూన్ 20 నుండి 2008 ఆగస్టు 18 వరకూ పాకిస్థాన్ దేశాధ్యక్షుడుగా పని చేశారు. అప్పట్లో ఆయనపై దేశ ద్రోహం అభియోగాలు నమోదు అయ్యాయి. రాజ్యాంగాన్ని రద్దు చేసి సైనిక పాలన విధించి తీవ్ర దేశ ద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో 2019 లో పాకిస్థాన్ ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది.

1999 లో తిరుగుబాటు ద్వారా అధికారాన్ని స్వాధీనం చేసుకొని, అధ్యక్షుడి స్థానాన్ని చేజిక్కించుకొని, నిరంకుశంగా పరిపాలించిన ముషారఫ్ దేశ ద్రోహి నేరానికి పాల్పడ్డారని కోర్టు అభిప్రాయపడింది. కానీ తర్వాత 2020 లో అతని మరణ శిక్షను లాహోర్ హైకోర్టు నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. గత 2018 నుండి ముషారఫ్ ప్రాణాంతక వ్యాధి అమిలోయిజోసిన్ తో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే దుబాయ్ లోని అమెరికన్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. 2016 నుండి ఆయన దుబాయ్ లోనే ఉంటున్నారు. గత జూన్ లోనే అతని కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు. మాజీ ఆర్మీ చీఫ్ కోలుకోవడం సాధ్యం కావడం లేదనీ, అతని అవయవాలు పని చేయని దశలో ఉన్నాయని పేర్కొన్నారు. అనారోగ్యం కారణంగా మూడు వారాల క్రితం అసుపత్రిలో చేర్చామని, త్వరగా కోలుకోవాలని ప్రార్ధించాలని తెలిపారు. అయితే సుదీర్ఘ కాలంలో అసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju