NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు చేయని ఆ పని జగన్ చేశారు .. అది ఏమిటంటే..?

రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనీ దీని వల్ల రెండు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు తలెత్తుతున్నాయని పిటిషన్ లు పేర్కొన్నారు. భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరగాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు నియమ నిబంధనలు అవసరమని ఆ మేరకు కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ల పై ఈ నెల 22వ తేదీ విచారణ జరగాల్సి ఉండగా, బుధ, గురువారాల్లో కేవలం నోటీసులు ఇచ్చిన పిటిషన్లపై తుది విచారణలో ఉన్న పిటిషన్లు మాత్రమే వాదనలకు తీసుకోవాలని సీజేఐ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆవేళ విచారణ జరగలేదు. ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ తరపు న్యాయవాది అల్లంకి రమేష్ ధర్మాసనం ముందు ప్రత్యేక విజ్ఞప్తి చేసిన చేయడంతో విచారణను జస్టిస్ జోసెఫ్, జస్టిస్ నాగరత్న, జస్టిస్ పార్దేవాలాలతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 11వ తేదీకి వాయిదా వేసింది.

State Bifurcation Issues In Supreme Court

 

ఇదిలా ఉండగా, తాజాగా ఏపి ప్రభుత్వం .. విభజన చట్టం కేసులో సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇంతకు ముందు డిసెంబర్ మొదటి వారంలో విభజన గురించి వదిలేయండి అని ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడంపై ఉండవల్లి ఘాటుగా స్పందించారు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ రకంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు ఉండవల్లి. ఏపి ప్రయోజనాల కోసం సీఎం జగన్ పోరాటం చేయాలని ఉండవల్లి సూచించారు. పోరాటం చేసి జగన్ సీఎం అయ్యారనీ, కానీ ఇప్పుడు దీంతో జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోయే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఏపికి అన్యాయం జరుగుతున్నా నాడు చంద్రబాబు పోరాటం చేయని కారణంగానే 23 సీట్లకు పరిమితం అయ్యారని అన్నారు. ప్రధాని మోడీతో సీఎం జగన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయినీ, కానీ ఏపి ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఉండవల్లి ముఖ్యమంత్రిని కోరారు. రాబోయే విచారణ సమయానికి అయినా రాష్ట్ర ప్రభుత్వం జరిగిన అన్యాయం వివరిస్తూ కోర్టులో అఫిడవిట్ వేయాలని సూచించారు.

Jagan Chandrababu

 

ఉండవల్లి సూచనలపై సీఎం జగన్ స్పందించినట్లు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిపై ఉండవల్లి స్పందిస్తూ ఏపి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం శుభ పరిణామమని అన్నారు.  ఈ అఫిడవిట్ కారణంగా ఏపికి మంచి జరిగే అవకాశం ఉందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా సహా కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన వాటిలో న్యాయం జరుగుతుందని అన్నారు. తెలంగాణ నుండి ఏపికి రావాల్సిన విద్యుత్ బకాయిల అంశాన్ని కూడా ప్రభుత్వం అఫిడవిట్ లో పొందుపరిచిందని చెప్పారు. ఇదే విధంగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలని గతంలో చంద్రబాబుకు చెప్పాననీ, చేస్తానని చెప్పిన ఆయన చేయలేదన్నారు. అఫిడవిట్ లో ఉన్న అంశాలన్నింటినీ ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు.

చికోటి ప్రవీణ్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..రూ.3కోట్ల కారు వ్యవహారంలో నోటీసులు

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?