NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

గత ఎన్నికలు నేర్పిన పాఠం .. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన..విపక్షాలకు బిగ్ షాక్

గత ఎన్నికలు నేర్పిన పాఠంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మమతా బెనర్జీ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు షాకింగ్ అని చెప్పవచ్చు. వచ్చే ఏడాది జరిగే లోక్ సభ ఎన్నికల్లో జట్టు కట్టాలని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీని ఓడించేందుకు ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని కాంగ్రెస్ కూడా ఆశిస్తున్నది. విపక్షాలు ఏకం అయితేనే బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని బీజేపీ వ్యతిరేక పక్షాలు భావిస్తుండగా, తృణమూల్ అధినేత్రి మమత కీలక ప్రకటన వారిని షాకింగ్ గురి చేసింది.

Mamata Banerjee

 

వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో టీఎంసీ ఒంటరిగా పోరాడుతుందని దీదీ స్పష్టం చేశారు. దీంతో విపక్షాల కూటమికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.  ప్రతిపక్షాల కూటమి ఏర్పాటు కాకముందే పశ్చిమ బెంగాల్ లో 42 స్థానాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సీపీఎం, కాంగ్రెస్ లు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని మమత ఆరోపించారు. అపవిత్ర పొత్తులుంటే బీజేపీతో కాంగ్రెస్ ఎలా పోరాడుతుందని ప్రశ్నించారు. బెంగాల్ లోని సిర్దిఘిలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఎంసీ ని కాంగ్రెస్ అభ్యర్ధి ఓడించిన విషయం గురించి ప్రస్తావిస్తూ.. ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ వామపక్షాలు, బీజేపీ అన్నీ మతం కార్డు ఉపయోగించాయని దీదీ ఆరోపించారు.

2019 ఎన్నికల్లో మమత విపక్షాల కూటమిలో కీలక భూమిక పోషించారు. అయితే ఆ ఎన్నికల్లో కూటమికి చుక్కెదురైంది. పశ్చిమ బెంగాల్ లో 12 పార్లమెంట్ స్థానాలు నష్టపోయి 22 స్థానాలే టీఎంసీ కైవశం చేసుకుంది. బీజేపీ రెండు స్థానాల నుండి 18 స్థానాలకు ఎగబాకింది. రాష్ట్రంలో బీజేపీ విస్తరించింది. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులను వడ్డినప్పటికీ దీదీ నేతృత్వంలోని టీఎంసీ మరో సారి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఈ పర్యవసానాల కారణంగా దీదీ .. ఒంటరిగానే పోటీకి సన్నద్దం అవుతున్నారు. ఆ మేరకు నిర్ణయాన్ని ప్రకటించారు.

 

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ .. తొలి రోజు కార్యక్రమాలు ఇలా..

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో కూటమి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju