NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రారంభమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ .. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం వైఎస్ జగన్

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ కొనసాగుతోంది. ముందుగా ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత వరుసగా మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 9 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకూ కొనసాగనున్నది. 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాన్ని వెల్లడించనున్నారు.

AP CM YS Jagan

 

శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175 కాగా ఇందులో వైసీపీకి 151 మంది సభ్యులు ఉన్నారు. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే చాలా కాలంగా నలుగురు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీకి నైతికంగా అసెంబ్లీలో 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్నా అభ్యర్ధిని బరిలోకి దింపింది. ఎడు ఎమ్మెల్సీ స్థానాలకు 8 మంది పోటీ పడుతుండటంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి రానున్నారు.

 

పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పటికే చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుండి అసెంబ్లీకి బయలుదేరతారు, 11 గంటలకు చంద్రబాబు అసెంబ్లీకి చేరుకోనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. తాను ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతానని గతంలో చంద్రబాబు శపథం చేసిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మాత్రమే ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ తర్వాత మరల అసెంబ్లీకి రాలేదు. చాలా రోజుల తర్వాత చంద్రబాబు అసెంబ్లీకి వస్తుండటంతో టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలకనున్నారు. చంద్రబాబు నివాసం నుంచే అసెంబ్లీకి అందరూ బయలుదేరి రానున్నారు. మరో పక్క ఎనిమిదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమైయ్యాయి. ప్రశ్నోత్తరాల అనంతరం పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లను సభ్యులు ఆమోదం తెలపనున్నారు. తదుపరి పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనున్నది.

విశాఖలో విషాదం .. ముగ్గురు మృతి

Related posts

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju