NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Rain Alert: ఏపిలో మరో వారం రోజులు వర్షాలు .. ఏయే ప్రాంతాల్లో అంటే..?

Rain Alert:  ఆంధ్రప్రదేశ్ లో మరో వారం రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ పరిసరాల్లో కొనసాగుతొన్న ఉపరితల అవర్తనం నుంచి ఉత్తర కర్ణాటక మీదుగా దక్షిణ కర్ణాటక వరకు ద్రోణి విస్తరించిందనీ, దీని ప్రభావంతో సముద్రం నుంచి తేమ గాలులు వీస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా కోస్తా, రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురస్తాయని పేర్కొంది. అదే సమయంలో గంటకు 30 నుండి 40 కిలో మీటర్ల వేగంతో ఊదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Rain Alert for a week in Andhra-Pradesh
Rain Alert for a week in Andhra-Pradesh

 

విదర్భ నుండి కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి తూర్పు దిశకు పయనించే క్రమంలో రాష్ట్రంలో వర్షాలు మరింతగా కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ నెల 29 నుండి ధ్రోణి కోస్తాపైకి వస్తుందని, ఆ తర్వాత నుండి వర్షాలు కురస్తాయని చెప్పారు. ఏప్రిల్ 30 నుండి మే 3,4 తేదీల వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు గాలి తీవ్రత పెరుగుతుందని వివరించారు. వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్న నేపథ్యంలో రైతులు పంటలు దెబ్బతినకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

గత మూడు నాలుగు రోజులుగా వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా భానుడి భగభగల నుండి ప్రజలకు ఉప శమనం లబించగా, రైతులకు మాత్రం తీరని నష్టం వాటిల్లింది. వడగండ్లు, భారీ వర్షాలకు మరి కొద్దిరోజుల్లో చేతికి అందివస్తుందనుకున్న పంట దెబ్బతిన్నది. కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం కూడా తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట దెబ్బతిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

YS Viveka Murder Case: వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు ..సునీతకు మద్దుతుగా

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju