NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: డీకే శివకుమార్ తో వైఎస్ షర్మిల భేటీ .. అందుకే అంటూ ప్రచారం

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, డిప్యూటి సీఎం డీకే శివకుమార్ తో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి కీలకంగా వ్యవహరించిన డీకే శివకుమార్ కు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేఎస్ ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లుగా షర్మిల చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ చర్చకు దారి తీసింది. గత కొద్ది రోజులుగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ టీపీ మధ్య ఎన్నికల్లో పొత్తు ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో డీకే శివకుమార్ తో షర్మిల భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలోనే వారి మధ్య రాజకీయ పరమైన చర్చ జరిగి ఉండవచ్చని అంటున్నారు.

YS Sharmila Meets Karnataka Pcc Chief and Dy CM DK Shivakumar

 

ప్రస్తుతం తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఒంటరిగా పోటీ చేస్తే పట్టుమని పది స్థానాలు కూడా గెలుచుకునే పరిస్థితి లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి శత్రువు బీఆర్ఎస్ పార్టీ కావడంతో కలిసి పోటీ చేయడం వల్ల అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు షర్మిలకు లాభదాయకంగా ఉంటుందని రెండు పార్టీలు భావిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం వైఎస్ఆర్ టీపీని విలీనం చేయాలని కోరుతోందని, అలా చేస్తే పార్టీలో సముచిత స్థానం కల్పించడంతో పాటు ఏపి పార్టీ పగ్గాలు అప్పగించడానికి సిద్దంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో ఆ ఊపును తెలంగాణలో కొనసాగించాలని కాంగ్రెస్ భావిస్తుంది.

షర్మిల పార్టీకి ఎన్ని ఓట్లు పడినా అవన్నీ కాంగ్రెస్ పార్టీకి మైనస్ కిందకే వస్తాయి. షర్మిల పార్టీ లేకపోతే ఆ ఓట్లు కాంగ్రెస్ కు ప్లస్ అవుతాయి. ఇవన్నీ ఆలోచించి కాంగ్రెస్ పార్టీ షర్మిలను దగ్గర చేసుకునే పనిలో ఉంది. ఎలాగూ డీకే శివకుమార్ తో మంచి పరిచయాలే ఉన్నందున షర్మిలతో ఆ విషయాలపై మాట్లాడి ఉంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ ఏపిలో సోదరుడు జగన్ సీఎంగా ఉండటం వల్ల షర్మిల తెలంగాణలో రాజకీయాలు వదిలివేసి ఏపికి రావడానికి ఒప్పుకుంటారా..? లేదా తెలంగాణలోనే కొనసాగాలని కోరుకుంటారా..? విలీనానికి ఓకే చెబుతారా..? పొత్తుకు సై అంటారా..? అనే విషయాలు తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Breaking: రామోజీకి బిగ్ షాక్ .. రూ.793 కోట్ల ఆస్తులను ఆటాచ్ చేసిన ఏపీ సీఐడీ

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?