NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Yarlagadda Venkatarao: గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించిన లోకేష్..!!

Yarlagadda Venkatarao: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గన్నవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా యార్లగడ్డ వెంకట్రావును ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర గన్నవరం నియోజకవర్గంలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఈ సభకి కృష్ణాజిల్లాతో పాటు ఏలూరు ఇంకా పశ్చిమగోదావరి జిల్లా కి చెందిన తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సభలో వైసీపీ ప్రభుత్వంపై అదే విధంగా కొడాలి నాని ఇంక వల్లభనేని వంశీ లపై లోకేష్ తో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Lokesh announced Yarlagadda Venkatarao as the in charge of Gannavaram TDP

వల్లభనేని వంశీనీ వచ్చే ఎన్నికలలో ఓడించాలని లోకేష్ పిలుపునిచ్చారు. కొడాలి నానిని సైతం ఓడించాలని ప్రజలను కోరారు. రాజకీయాలకు సంబంధం లేని తన కుటుంబ సభ్యులపై అనవసరంగా నోరు జారుకున్నారని హెచ్చరికలు చేశారు. వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని పేర్కొన్నారు. అయితే మంగళవారం సభ జరగక బుధవారం గన్నవరం ఇన్చార్జిగా యార్లగడ్డ వెంకట్రావుని లోకేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ.. గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ ఓటమి కోసం.. తామంతా కలిసి పని చేస్తామని స్పష్టం చేశారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కంచుకోట అని చెప్పుకొచ్చారు. కచ్చితంగా వచ్చే ఎన్నికలలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుందని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ..వైసీపీకి మద్దతు తెలిపిన గాని ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు వెల్లలేదని స్పష్టం చేశారు.

Lokesh announced Yarlagadda Venkatarao as the in charge of Gannavaram TDP

రాజకీయాల్లోకి తాను రౌడీయిజం చేయడానికి రాలేదని ప్రజాసేవ చేయడం కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. కొత్త పాత కలయికలను సమన్వయం చేసుకొని ముందుకు సాగుతామని అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఎవరికైనా సమస్య వస్తే నేరుగా తన వద్దకు వచ్చి చెప్పుకోవచ్చు అని యార్లగడ్డ స్పష్టం చేశారు. 2019 ఎన్నికలలో గన్నవరం నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన యార్లగడ్డ వంశీ చేతిలో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాగా వంశీ..వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటినుండి వైసీపీ హై కమాండ్ పై అసహనంగా ఉన్న యార్లగడ్డ.. కొద్ది రోజుల క్రితం చంద్రబాబుని కలవడం జరిగింది. ఆ తర్వాత లోకేష్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో లోకేష్ బుధవారం గన్నవరం ఇన్చార్జిగా యార్లగడ్డని ప్రకటించడంతో.. కృష్ణాజిల్లాలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!