NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు కేసులో మరో సారి ఉత్కంఠ .. రేపు సుప్రీం కోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు కేసు

Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇటీవల ఏపీ హైకోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబుకు హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో మంగళవారం విచారణకు రానుంది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనంలో ఐటెం నం.64 కింద ఏపీ సర్కార్ పిటిషన్ లిస్ట్ అయ్యింది. స్కిల్ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడి, ఆ నిధులను టీడీపీ ఖాతాలకు మళ్లించారు అనేందుకు సీఐడీ ఎలాంటి ఆధారాలూ సమర్పించలేదంటూ చంద్రబాబు కు ఏపీ హైకోర్టు పూర్తి స్థాయి బెయిల్ ఇవ్వడాన్ని ఏపీ సర్కార్ తప్పుబడుతూ ఈ నెల 21న సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో ఏపీ హైకోర్టు మినీ ట్రయల్ నిర్వహించడంతో పాటు, వాస్తవాలను పరిగణలోకి తీసుకోవడంలో పొరబడిందని, అందువల్ల చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరింది ఏపీ సర్కార్. మెరిట్స్ పై అభిప్రాయం వ్యక్తం చేయడం ద్వారా హైకోర్టు తన పరిధిని ఉల్లంఘించిందని కాబట్టి హైకోర్టు తీర్పును కొట్టేయాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టు అయిన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు గత నెల మూడవ వారంలో ఆరోగ్య కారణాల రీత్యా మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. దాంతో ఆయన  దాదాపు 52 రోజుల తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్ నుండి విడుదల అయ్యారు.

ఈ నెల 28వ తేదీతో మద్యంతర బెయిల్ గడువు ముగిసి రాజమండ్రి సెంట్రల్ జైల్ ముందు చంద్రబాబు హజరు కావాల్సి ఉండగా, ఈ నెల 20వ తేదీన చంద్రబాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. మరో పక్క స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో అక్టోబర్ 17న విచారణను ముగించి తీర్పు వాయిదా వేసింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ నెల 30వ తేదీన సుప్రీం కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసు విచారణ లోపు క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువరిస్తామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. వీటిపై ఉత్కంఠ కొనసాగుతున్న తరుణంలోనే స్కిల్ కేసులో  చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు రావడం జరిగింది. ఈ తరుణంలో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం  తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Breaking: బీఆర్ఎస్ సర్కార్ కు ఈసీ బిగ్ ఝులక్ .. రైతు బంధు నిధుల విడుదలపై కీలక ఆదేశాలు

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?