NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Congress: కాంగ్రెస్ అధిష్టానానికి చేరిన తెలంగాణ సీఎం పంచాయతీ .. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన భట్టి

Telangana Congress: తెలంగాణ సీఎం ఎవరు అవుతారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ పేరును అధిష్టానం దాదాపు ఖరారు చేసిందన్న వార్తలు వినబడుతున్నా.. సీనియర్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా తమ పేరును పరిశీలించాలని అధిష్టానానికి కోరుతుండటంతో సందిగ్దత కొనసాగుతోంది. నిన్న జరిగిన సీఎల్పీ సమావేశంలో సీఎం ఎంపిక బాధ్యతను హైకమాండ్ కు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సీఎల్పీ తీర్మానం, ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్న డీకే శివకుమార్ సహా పార్టీ పరిశీలకులు ఢిల్లీకి చేరుకుని పార్టీ హైకమాండ్ కు నివేదించారు.

ఈ విషయంపై ఖర్గే మంగళవారం ఉదయం ఓ క్లారిటీ ఇచ్చారు. ఇవేళ పార్లమెంట్ లోకి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఛాంబర్ లో కాంగ్రెస్ సమావేశం కానుంది. ఈ సమావేశానికి ఖర్గే వెళుతూ మీడియాతో మాట్లాడారు. ఈ రోజే సీఎం అభ్యర్ధిని ఖరారు చేస్తామని, సాయంత్రం లోపు సీఎం అభ్యర్ధిని ప్రకటిస్తామని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. పార్టీ పరిశీలకుల నివేదికను పరిశీలించి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలతో చర్చించిన అనంతరం సీఎం పేరును ప్రకటిస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి  కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను కలిసి.. సీఎం అభ్యర్ధి ఎంపిక విషయంలో తమ పేర్లు కూడా పరిశీలించాలని కోరనున్నట్లు తెలుస్తొంది. కాగా, పార్టీ అధిష్టానంతో చర్చల అనంతరం డీకే శివకుమార్, పార్టీ పరిశీలకులు ఇవేళ సాయంత్రం సీఎం అభ్యర్ధి పేరున్న సీల్డ్ కవర్ తో హైదరాబాద్ చేరుకుంటారని అంటున్నారు.

నిన్న (సోమవారమే) సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్ధిని ఎంపిక చేస్తారని, రాత్రికి ప్రమాణ స్వీకారం ఉంటుందని అందరూ భావించారు. అయితే రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చేందుకు పలువురు సీనియర్ లు తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా వార్తలు వచ్చాయి, ఇదే క్రమంలో ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే తనకు ఒక్కడికి మాత్రమే ఇవ్వాలనీ,వేరే ఎవరికి ఇచ్చినా ఒప్పుకునే ప్రసక్తిలేదని భట్టి విక్రమార్క అన్నట్లు తెలుస్తొంది. అయితే సీతక్కకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు సమాచారం.

ఇక స్పీకర్ పదవి తీసుకునేందుకు దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యతిరేకించినట్లు వార్తలు వినబడుతున్నాయి. పరిశీలకుల వద్ద జరిగిన సమావేశంలో పరుష పదజాలంతో పలువురు సీనియర్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న కారణంగానే .. సీఎం అభ్యర్ధి ఎంపికను వాయిదా వేసి పరిశీలకులు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఈ నెల 7వ తేదీనే సీఎం సహా నూతన కేబినెట్ ప్రమాణ స్వీకారం ఉంటుందని భావిస్తున్నారు.

Telangana Congress: దిశదిన గండం నూరేళ్ల ఆయుష్షే(నా)..! మాజీ మంత్రి కడియం సంచలన కామెంట్స్

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?