NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Visakha: విశాఖలో మరో ఐటీ దిగ్గజ సంస్థ ..ఐటీ మంత్రితో అమెరికా కంపెనీ ప్రతినిధుల మంతనాలు

Visakha: వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖలో బీచ్ ఐటీ కారిడార్ అభివృద్ధి చేస్తున్న క్రమంలో దిగ్గజ ఐటీ సంస్థలు రాష్ట్రాలు వస్తున్నాయి. తాజాగా అమెరికాలోని ప్రముఖ ఐటీ కంపెనీ ట్రినిటీ సంస్థ హెల్త్ రైజ్ పేరుతో విశాఖలో ఐటీ అనుబంధ సంస్థ ఏర్పాటునకు ముందుకు వచ్చింది.

రుషికొండ ఐటీ హిల్స్ నందు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ తో హెల్త్ రైజ్ సంస్థ సీఈవో డేవిడ్ ఫార్బ్ మెన్, ఏసీఎన్ ఇన్పోటెక్ ఎండీ చమన్ బైద్, ఏసిటా సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి, ఏపీ ఐటీ సలహాదారు శేషిరెడ్డితో భేటీ అయ్యారు. సంస్థ అందించే సేవలు, కల్పించే ఉద్యోగావకాశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హెల్త్ రైజ్ సంస్థ సీఈఓ డేవిడ్ మాట్లాడుతూ.. తమ సంస్థ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడిచేందుకు హెల్త్ కేర్ ఆర్గనేజేషన్స్ కు సహకారం అందిస్తుందని చెప్పారు.

రెవెన్యూ మేనేజ్ మెంట్, హెల్త్ కోడింగ్, వైద్య సంస్థలకు ఐటీ సర్వీసులు సైతం అందించేలా విశాఖ నుండి సంస్థ పని చేస్తుందని డేవిడ్ తెలిపారు. మంత్రి అమరనాథ్ మాట్లాడుతూ ఏపిటా, ఏసీఎన్ ఇన్ ఫోటెక్ అనే బీపీవో సంస్థ సహకారంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ సముఖత వ్యక్తం చేసిందని చెప్పారు. ఈ సంస్థ ఇక్కడ 5వేల మందికి ఉపాధి కల్పిస్తుందని తెలిపారు.

ఏపీని అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేయడంతో అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 300 ఇంజనీరింగ్ కళాశాలల ద్వారా ఏటా లక్షా 20వేల మంది వివిధ కోర్సులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారని అన్నారు. అమెరికాలోని వివిధ టెక్ కంపెనీల్లో పని చేస్తున్న ప్రతి నలుగురిలో ఒక తెలుగువాడు ఉంటాడని అమెరికా సంస్థ బృందానికి వివరించారు. స్టార్టప్స్ లో కూడా తెలుగు విద్యార్ధులు బాగా రాణిస్తున్నారని తెలియజేశారు.

Vrinda Dinesh: ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు కానీ WPL ఆక్షన్ లో 1.3 కోట్లు పలికిన ‘వృందా దినేష్’ ఎవరు? | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్

 

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?