NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 04 2024 Episode 358: అడ్డంగా దొరికిపోయిన దేవ్, ముకుంద.. భవానిని ఆలోచించేలా చేసిన కృష్ణ.. ఉహించని ట్విస్ట్

Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights

Krishna Mukunda Murari January 04 2024 Episode 358:  కృష్ణ మురారి ఇద్దరు ఆ మర్డర్ కేస్ కి సంబంధించిన ఫోటోలు చూసి కృష్ణ ఆ ఫోటోలో అతని ముఖానికి ఏదో ముద్ర ఉంది చూడండి అని మురారి కి చూపిస్తుంది. ఇది ఎవరో అతనిని పిడుగులు గుద్దినప్పుడు అతని ఉంగరానికి ఉన్న ప్రింట్ పడింది అది దేవ్ ఉంగరానిది. ఈ ఉంగరం ఎవరిదో తేల్చాలి అని మురారి డిసైడ్ అవుతాడు. ఈ విషయాన్ని మనం ఇంట్లో ఎవరితో డిస్కస్ చేయొద్దు ఎవరు మన మధ్యనే ఉంటూ మనకి కీడు చేస్తున్నారు. ఎవరో మనల్ని కావాలనే తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈ వేలుకి ఉన్న ఉంగరం ఎవరిదో తేల్చాలి. పదా వెళ్దాం అని మురారి అంటాడు. ఈ విషయం మన ఇద్దరికీ తప్ప ఇంకా ఎవరికీ తెలియకూడదు. ముందు ఈ ఉంగరం ఎవరితో తెలిస్తే దొంగ దొరికిపోతాడు అని మురారి కృష్ణ డిసైడ్ అవుతారు.’

Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights
Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights

అప్పుడు కృష్ణ ఒకవేళ ముకుందానే ఇదంతా చేస్తుందేమో అని అంటుంది. మనం ఇలా ఎందుకు ఆలోచించట్లేదు. ఒకవేళ ముకుందా వాళ్ళ అన్నయ్య రేపు మనతో మంచిగా ఉన్నట్టే నటించి ఇదంతా చేస్తుండొచ్చు కదా అని కృష్ణ అంటుంది. దేవ్ కి అంత అవసరం ఉన్న తనకి ఆఫీసులో ఉంటున్న నారాయణ వాళ్ళ కొడుకు తెలియదు . మరి ఈ బొమ్మ ఎవరు గీయించి ఉంటారు. అలాగే ఇప్పటికిప్పుడు ఆర్టిస్ట్ అతని ఎందుకు చంపాలి. మనకి హెల్ప్ చేసేది డాక్టర్ పరిమళా అని తెలుసు కదా.. మరి పరిమళను ఎందుకు చంపలేదు. మనల్ని ఎక్కడో ఎవరో తప్పు దోవ పట్టిస్తున్నారు. ముందు ఈ ఉంగరం ఉన్న అతన్ని మనం పట్టుకోవాలి. ఈ విషయంతో ఇక మీ చిన్నన్న ఈ తప్పు చేయలేదని మనం పెద్దమ్మ దగ్గర ధైర్యంగా చెప్పొచ్చు అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights
Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights

రేవతి, నందిని, ప్రసాద్, సుమతి అంతా మాట్లాడుకుంటూ ఉండగా.. అప్పుడే వాళ్ళ దగ్గరకి భవాని ఊహించని బాంబు పేలుస్తుంది. రేపు ముకుంద మురారి లకు నలుగు పెడుతున్నాం అని అందరికీ చెబుతుంది. ప్రసాద్ ఆ నలుగు కి కావాల్సిన అన్ని నువ్వే చూసుకో అని అంటుంది. అప్పుడే ప్రసాద్ ఇప్పుడే ఇంట్లోకి వస్తే కృష్ణ వాళ్ళ చిన్నమ్మ శకుంతలను చూశాను తను చాలా బాధపడుతుంది వదిన. తన కూతురి జీవితం ఇలా అయిపోయింది ఏంటి అని బాధపడుతూ ఉంది అని ప్రసాద్ అంటాడు. అప్పుడు రేవతి కూడా మురారి కి ఈ పెళ్లి ఇష్టం లేదు అని భవానితో అంటుంది. కృష్ణుని కూడా మురారి మొదట ఇష్టపడి చేస్తా చేసుకోలేదు కదా అంటే.. ఇప్పుడు వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉంటున్నారు అని కదా అని అంటుంది. అలానే పెళ్లయిన తర్వాత ముకుంద మురారి కూడా సంతోషంగా ఉంటారు అని అంటుంది భవాని.

Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights
Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights

నందిని శకుంతల వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పటికి శకుంతల ఇంట్లో బట్టలన్నీ సర్ది బ్యాగ్ తీసుకొని బయట నిలబడుతుంది. ఏమైంది అత్తయ్య ఎందుకు ఇప్పుడు బట్టలన్నీ సర్దేసుకున్నావు. మీ ఊరు వెళ్తున్నావా అంటే అవును నేను ఊరు వెళ్తున్న మాకు ఇట్టమ్మ జీవితం బాగు చేయాలి‌. అందుకే నాతోపాటు కిట్టమని నా అల్లుడ్ని వస్తే నిన్ను మీ అత్తయ్య చిన్నమ్మను కూడా తీసుకువెళ్తాను అని చెబుతుంది. నేను చూస్తుండగానే నా కిట్టమ్మ జీవితం నాశనం అయిపోవడం నాకు ఇష్టం లేదు .మీ అమ్మ ఏమన్నా అనుకోని మహా అయితే ఒక నాలుగు రోజులు అరుస్తుంది. ఆ తర్వాత జీవితం నాశనం చేయలేము కదా శకుంతల తన మనసులో ఉన్న వేదన నందినితో చెబుతుంది. నేను చేసేది తప్ప నందిని అని అడగగా లేదు పెద్దమ్మ మీరు కరెక్టే చేస్తున్నారు అని నందిని శకుంతలకి సపోర్ట్ చేస్తుంది. అయితే నువ్వు త్వరగా వెళ్లి రేవతి వదిన పిలుచుకు రమ్మని చెప్తుంది.

Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights
Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights

ముకుంద దేవి ఇద్దరు ఈ పెళ్లి జరుగుతుందా జరగదా అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాకా ఈ గోరాలన్నీ చేసింది మీ పెళ్లి జరగడానికే కదా ముకుంద ఇంకా ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు అని దేవ్ ముకుందతో చెబుతాడు. సరిగ్గా అదే సమయంలో సుమతి అక్కడికి వస్తుంది. సుమతి అక్కడ చూడగానే దేవ్, ముకుంద కి చుక్కలు కనిపిస్తాయి. ఎక్కడ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు వినిందో అని .. ఎంటి ముకుంద అంత కంగారు పడుతున్నవు నన్ను చూసి అని సుమతి అంటుంది. ఏం లేదు అత్తయ్య నా పెళ్లి జరిపించే బాధ్యత పెద్దత్తయ్య తీసుకున్నారు కదా, అని ముకుంద కవర్ చేస్తుంది. సుమతి ముకుందా తన దగ్గర ఏదో దాస్తుంది అని అర్థం చేసుకొని వెళ్ళిపోతుంది.

Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights
Krishna Mukunda Murari Today Episode January 04 2024 Episode 358 Highlights

నందిని గబగబా రేవతి దగ్గరికి వచ్చి చిన్నమ్మ నిన్ను శకుంతల అత్తయ్య రమ్మని పిలుస్తుంది. రా అని అడుగుతుంది ఎందుకు చెప్పు అని అడుగుతుంది. అప్పుడు కృష్ణ మురారి ని ఊరు తీసుకువెళ్లి రమ్మంటుంది. కృష్ణ డాక్టర్, మురారి పోలీస్ ఇద్దరు సంతోషంగా అక్కడ ఉంటారు. ఒక రెండు రోజులు కూడా తర్వాత వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండడం చూసి కనీ సంతోషిస్తుంది అని చెప్పింది. నాకు కూడా అత్తయ్య చెప్పిన మాటలు లో వాస్తవం ఉంది అనిపించింది కదా మనం వెళ్దాము అని నందిని రేవతి తో చెప్పడం భవాని చాటుగా వింటుంది.

శకుంతల వాళ్ళ ఇంటికి రేవతి, నందిని వస్తారు. అప్పుడే కృష్ణ మురారి కూడా అక్కడికి వస్తారు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినాలి అని భవాని మేడ మీదకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు కృష్ణ మురారి అక్కడికి వస్తారు వచ్చారా.. పదండి మన ఊరు పోదామని శకుంతల గొడవ చేస్తుంది విను అని కృష్ణన్న వచ్చి చెప్పడానికి ప్రయత్నిస్తుంది. కానీ శకుంతల ఎవరు మాట వినదు నీ జీవితం నాశనం అయిపోతుంది. నీకు అర్థం కావడం లేదు ఇక్కడే ఉంటే నీ ముందే నీ భర్త పెళ్లి చేసేస్తారు అదంతా చూసి నేను తట్టుకోలేను కదా ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని శకుంతల అంటుంది. రేపు ఎప్పుడైనా ఈ కేసులో మీరు నిజం ప్రూవ్ చెయ్యవేసిన చేయకపోయినా మీ భవాని అత్తయ్య ఒకవేళ మాట తప్పితే నువ్వేం చేస్తావు అని కృష్ణుని నిలదీస్తుంది శకుంతల. మా భవాని అత్తయ్య ఎప్పటికీ మాట తప్పదు నాకావే మాట మీద నమ్మకం ఉంది అని కృష్ణ ధైర్యంగా చెప్పడం చూసి భవాని ఆలోచనలో పడుతుంది. అయినా అత్తయ్య మీరేం కంగారు పడకండి మావయ్య ఈ తప్పు చేయలేదని ఈ హత్యతో తేలిపోయింది. ఖచ్చితంగా ఈ పెళ్లి జరగదు అని మురారి అంటాడు. నేను ఎక్కడికి రాను అని కృష్ణ కరాకండిగా చెబుతోంది. నేను ఇక్కడే ఉంటాను కానీ శకుంతల తన ఆలోచనను విరమించుకునేలాగా కృష్ణ చేస్తుంది భవాని. కృష్ణ చాకచక్యాన్ని చూసి రేవతి మనసులో మెచ్చుకుంటుంది భవాని కూడా కృష్ణ మాట్లాడిన మాటలు నచ్చుతాయి.

కృష్ణ మురళి ఇద్దరు ఇంట్లోకి వచ్చేసరికి ప్రసాద్ సుమతి ఇద్దరు కూర్చుని నలుగుకి కావాల్సిన లిస్టు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఏం రాస్తున్నారు బాబాయిని మురారి అడగగా నీ నలుగుకి కావాల్సిన సరుకుల లిస్టు రాస్తున్నాను అని ప్రసాద్ చెబుతాడు. ఇక కృష్ణ కోపంగా చూసేసరికి అది కాదమ్మా కృష్ణ కూర్చో వదిన చెప్పింది కదా చేయాలి. తప్పదు నన్ను అర్థం చేసుకో అమ్మ అని అంటాడు. ఎలాగో ఈ పెళ్లి జరగదని నాకు తెలుసు చిన్న మావయ్య మీరు గంధం ఇంకాస్త ఎక్కువ రాయండి అని కృష్ణ అంటుంది. ఈ మాటలను కూడా భవాని దూరంగా నిలబడి వింటుంది. కృష్ణలో ఉన్న కాన్ఫిడెన్స్ ని భవాని గమనిస్తూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడే భవాని ఊహించని బాంబు పేలుస్తుంది రేపు ముకుంద మురారి లకు నలుగు పెడుతున్నాం అని అనౌన్స్ చేస్తుంది. అప్పుడు దేవ్ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందో అని నాకు అన్నం కూడా సహించడం లేదు అని తినకుండా ఉంటాడు. అప్పుడు దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని కృష్ణ, మురారి ఇద్దరూ చూస్తారు. ఇక మురారి దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని గుర్తిస్తే పెళ్లి జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri