NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణాలో జ‌న‌సేన – టీడీపీ మ‌న‌సులు క‌ల‌వ‌ట్లేదు… ప‌వ‌న్‌కు 3 సీట్లు కావాల‌ట‌…!

వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి ప‌నిచేయాల‌ని.. వైసీపీని గ‌ద్దె దింపాల‌ని.. టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం అధినేతలు చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, నేత‌ల‌కు ఇలుపునిస్తున్న విష‌యం తెలిసిందే. అయి తే.. ఇది పిలుపుగానే మారుతోందా? కార్య‌క‌ర్త‌లు.. ఎవరికి వారుగానే ఉంటున్నారా? అంటే.. కొన్ని కొన్ని జిల్లాల్లో ప‌రిస్థితులు గ‌మ‌నిస్తున్న ప రిశీల‌కులు ఔన‌నే అంటున్నారు. నిజంగానే క‌లివిడిగా ఉంటే.. ప‌రి స్థితి వేరేగా ఉండేది. కానీ, అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

పోనీ.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలో మాత్రం ప‌రిస్థితి ఎవ‌రు కాద‌న్నా .. ఔన‌న్నా.. ఎవ‌రికి వారుగానే ఉన్నారు. య‌మునా తీరుగానే రివ‌ర్స్‌లో వెళ్తున్నారు. ఇక్క‌డ నుంచి కీల‌క మైన మూడు నియోజ‌క‌వ‌ర్గాల‌ను జ‌న‌సేన ఆశిస్తోంది. అదేవిధంగా ఒక పార్ల‌మెంటు స్థానం కూడా ఆశిస్తోం ది. అంటే.. మొత్తంగా నాలుగు కీల‌క స్థానాలు ఉన్నాయి. వీటిలో టీడీపీ ఇప్ప‌టి వ‌ర‌కు గెలుపు గుర్రం ఎక్క‌ని విజ‌యవాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం కూడా ఉంది.

ఇక‌, అవ‌నిగ‌డ్డ‌తో పాటు మ‌రో అసెంబ్లీ సీట్ల‌ను కూడా.. జ‌న‌సేన గ‌ట్టిగానే ప‌ట్టుబ‌డుతోంది. అదే స‌మ‌యంలో మ‌చిలీప‌ట్నం ఎంపీ సీటును ఇప్ప‌టికే అడిగేసింది. త‌ప్ప‌ద‌ని తీసుకుంద‌నే వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా.. జన‌సేన‌, టీడీపీ నాయ‌కులు క‌లిసి ప‌నిచేస్తున్నారా? అంటే.. లేద‌నే చెప్పాలి. నిజానికి ఈ రెండు పార్టీల అధినేత మ‌ధ్య ఉన్న సఖ్య‌త‌.. క్షేత్ర‌స్థాయిలో ముఖ్యంగా కృష్నాజిల్లాలో అయితే లేద‌ని చెప్పాలి. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన నేత పోతిన మ‌హేష్ పోటీ చేస్తార‌నే ప్ర‌చారంలో ఉంది.

అయితే.. ఈయ‌న‌ను క‌లుసుకునేందుకు టీడీపీ నేత‌లు ఇష్ట‌ప‌డ‌డం లేదు. అవ‌నిగ‌డ్డ‌లో మండ‌లి బుద్ధ ప్ర‌సాద్ దూకుడు పెంచారు. అంతేకాదు.. తాను నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు.. కేవ‌లం టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌కే స‌మాచారం ఇస్తున్నారు. ఇక‌, జ‌నసేన కూడా ఇలానే చేస్తోంది. పెడ‌న‌లో ఇక‌, చెప్పాల్సిన ప‌నిలేకుండా పోయింది, కాగిత వార‌సుడు కృష్ణ ప్రసాద్‌కు సీటు ఇచ్చేశారు. దీంతో ఇక్క‌డ జ‌న‌సేన‌లో అస‌మ్మ‌తి రాగాలు మొద‌ల‌య్యాయి. దీంతో రాష్ట్రంలో ఎక్క‌డ ఎలా ఉన్నా.. ఈ జిల్లాలో మాత్రం క‌లివిడి లేక‌పోగా.. విడివిడి రాజ‌కీయాలే క‌నిపిస్తున్నాయి.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?