NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

ఏపీలో బీబీపీ మార్క్ అస‌లు సిస‌లు రాజ‌కీయం స్టార్ట్ అయ్యింది. మోడీ చంద్ర‌బాబుతో క‌లిసింది.. ఆయ‌న్ను సీఎం చేయ‌డానికి కాద‌నే సంకేతాలు క్లీయ‌ర్గా క‌నిపిస్తున్నాయి. ప్ర‌ధాని మోదీ స‌భ‌తో ఏదేదో చేద్దామ‌ని భ్ర‌మ‌ల్లో ఉన్న చంద్ర‌బాబుకు మోదీ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చారు. మోడీ ఏపీలో అడుగు పెట్టిన టైం నుంచి ఆయ‌న వెళ్లిపోయే వ‌ర‌కు అంతా ప‌క్కా ప్లానింగ్ ప్ర‌కార‌మే జ‌రిగిన‌ట్లు ఉంది. అంతా బీజేపీ గేమ ఆడించేసింది.

మామూలుగా చూస్తే మోదీ ఏపీకి వచ్చిన సమయంలో మిత్రపక్షాల అధినేతలు విమానాశ్రయంలో స్వాగతం పలికి..ఆయనతో కలిసి సభకు చేరుతారు. గతంలోనూ 2014లో ఇదే జరిగింది. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా గన్నవరం విమానాశ్రయానికి చంద్రబాబు, పవన్ రావద్దని బీజేపీ చెప్ప‌డంతో అక్క‌డ కేవ‌లం బీజేపీ నేత‌లు మాత్ర‌మే మోదీకి స్వాగ‌తం ప‌లికారు. ఇక మోదీ వేదిక మీద‌కు వ‌చ్చాక వ‌రుస‌గా బీజేపీ నేతలు స్వాగ‌తాలు ప‌లికారు.

మోదీ వ‌చ్చే వ‌ర‌కు పుల్లారావు స‌భ‌ను స‌మ‌న్వ‌యం చేయ‌గా.. ఆ త‌ర్వాత స‌భ పూర్తిగా బీజేపీ నేత‌ల కంట్ర‌ల్లోకి వెళ్లిపోయింది. వేదిక మీద‌కు లోకేష్‌కు కూడా అవ‌కాశం ఇవ్వ‌లేదు. వేదిక‌పై ఉంచిన స‌భ బ్యాన‌ర్‌లోనూ ప్ర‌ధాని మోదీ, న‌డ్డా ఫొటోలు పెద్ద సైజులో ఉంచారు. ఇక పొత్తులో భాగస్వాములుగా ఉన్న చంద్ర‌బాబు, ప‌వ‌న్ ఫొటోలు ఫ్లెక్సీల్లో ప్రాధాన్య‌త లేకుండా చేశారు. ఇక బీజేపీ నాయ‌కురాలు పురందేశ్వ‌రి మోదీ స్పీచ్‌కు ట్రాన్స్‌లేట‌ర్‌గా ఉన్నారు. మోదీ పర్యటన, సభ మొత్తం బీజేపీ కేంద్ర కమిటీ పర్యవేక్షణలోనే జరిగింది. ప్రధాని ప్రసంగం పక్కా వ్యూహాత్మకంగా సాగింది.

స‌భ‌లో ప్ర‌ధానంగా ఎన్డీయే విజ‌యాల ప్ర‌స్తావ‌నే కొన‌సాగింది. బీజేపీకే ప్రాధాన్య‌త ఉండాల‌ని రాష్ట్ర నాయ‌క‌త్వానికి ఆ పార్టీ హై క‌మాండ్ తేల్చి చెప్పిన‌ట్టుగా కూడా గుస‌గుస‌లు న‌డిచాయి. స‌భ ముగిశాక సాధార‌ణంగా కూట‌మి నేత‌లు అంద‌రూ క‌లిసి చేతులు పైకెత్తి ఫొటోలు దిగుతారు. ఇక్క‌డ ఆ అవ‌కాశం కూడా లేదు. ఏదేమైనా మోదీ వేదిక మీద చంద్ర‌బాబు, ప‌వ‌న్‌తో మ‌న‌స్ఫూర్తిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నే టాక్ ? బీజేపీ ఏపీలో ఎదిగేందుకు ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా వ‌దులుకోవ‌డం లేదు.

అయితే ఏపీ బీజేపీలో చాలా మంది ఇప్ప‌ట‌కీ చంద్ర‌బాబు తొత్తులుగానే ఉంటూ పార్టీని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా పురందేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి వారు చంద్రబాబు కోసమే పని చేస్తున్నారని హై క‌మాండ్ ద‌గ్గ‌ర బ‌ల‌మైన అభిప్రాయం ఉంది. ఇక ఈ సారి చంద్ర‌బాబుకు చెంచాలుగా ఉండే నేత‌ల‌కు ఎంపీ, ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వ‌డం కూడా బీజేపీ జాతీయ నాయ‌క‌త్వానికి ఇష్టం లేద‌ని.. అందుకే టీడీపీకి ద‌గ్గ‌ర‌గా ఉండేవాళ్ల‌కు టిక్కెట్లు రావ‌ని కూడా అంటున్నారు. ఏదేమైనా మోదీ పేరుకు కూట‌మిలో ఉన్నా బాబు, ప‌వ‌న్‌తో మ‌న‌స్ఫూర్తిగా మింగిల్ అయ్యేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్న సంకేతాలు ఈ స‌భ నుంచే వ‌చ్చాయ‌ని అంటున్నారు.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella