NewsOrbit
Entertainment News Telugu TV Serials న్యూస్ సినిమా

Krishna Mukunda Murari March 30  2024 Episode 432: మీరా మీద కృష్ణ అనుమానం.. ఒకే బెడ్ మీద మీరా,మురారి.. ఆస్తి కావాలన్న ఆదర్శ్..

Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights

Krishna Mukunda Murari March 30  2024 Episode 432:  ముకుంద మీరాగా మారి, భవాని దేవితో కలిసి ఇంట్లోకి వస్తుంది. తను అనుకున్న విధంగా, ఇంట్లో సెట్ అయినందుకు చాలా సంతోషిస్తుంది. ఇక ఎలాగైనా గోడ మీద ఉన్న తన ఫోటోని తీసేయాలని ముకుంద అనుకుంటుంది. ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి రావడంతో ముకుంద అందరినీ నమ్మించేటట్టు మాట్లాడుతూ, మీరాగా అందరి నమ్మకాన్ని గెలుస్తుంది. ఇక అందరికీ వడ్డించావు కదా నువ్వు కూడా కూర్చో అని కృష్ణ అనడంతో ముకుందా భోజనానికి కూర్చుంటుంది. మీరా తను ముకుంద గురించి ఆలోచించినప్పుడల్లా బాధ వేస్తుందని తనతో నా జ్ఞాపకాలు కొన్ని చాలా మధురంగా ఉంటాయని కాకపోతే తనకి యాక్షన్ జరగడం రైలు కింద పడడం అనేది గుర్తొస్తే చాలా బాధేస్తుందని, ఇంట్లో ముకుంద ఫోటో చూసినప్పుడల్లా నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది మీరు ఆ ఫోటోని తీసేస్తారా అని అడుగుతుంది మీరా, ఆదర్శ్ కూడాముకుంద ఫోటో గోడ మీద ఉండడం నాకు నచ్చట్లేదని చెప్తాడు దాంతో భవానీ తన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరిని అర్థం చేసుకుంది లేదు బాధ పెట్టింది ఇప్పుడు ఫోటో కూడా బాధ పెడుతుంది అనుకుంటే నీ చేతులతో నువ్వే తీసేయ్ అని ఆదర్శ్ కి చెప్తుంది. ఇక భోజనం చేసిన తర్వాత ఆదర్శ ఫోటో తీసేయాలి అనుకుంటాడు. వెంటనే మీరా సంతోషపడుతుంది తన ఫోటో తీసేస్తున్నందుకు సంతోషిస్తుంది ఇక ఆదర్శ్ ముకుంద ఫోటో తీయమన్నాడు అంటే, అర్థముంది కానీ మీరా ముకుంద ఫోటో తీయమని ఎందుకు చెప్పింది అని కృష్ణ ఆలోచిస్తూ మీరా వైపు చూస్తే మీరా చాలా సంతోషంగా ఉంటుంది అప్పుడే మీరా మీద కృష్ణకు డౌట్ వస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights
Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights

ఇక మీరా మాత్రం సంతోషంగా అనుకున్నది సాధించావు ముకుందా ఏదైనా నువ్వు అనుకుంటే చేస్తావు ఇప్పుడు ఫోటో తీద్దాం అనుకున్నాము తీసేస్తున్నారు అని అనుకుంటుంది ఇక కృష్ణ మాత్రం రూమ్ లోకి వెళ్లి ఆలోచిస్తూ బట్టలు మడత పెడుతూ ఉంటుంది అక్కడ ఉన్న మురారి ఏంటి కృష్ణ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు చనిపోయిన వాళ్ళ ఫోటో హాల్లో పెట్టి దండేస్తే తప్ప ఏసిపి సార్ అని అడుగుతుంది. అలా ఏం లేదు అని అంటాడు మరి ఎందుకు మీరా ఆ ఫోటో తీయమని చెప్పగానే ఇంట్లో అందరూ కలిసి తీసేసారని కృష్ణ బాధపడుతుంది ఇక మురుకుంద ఎలాగూ మన మధ్య లేదు కనీసం తన ఫోటో అయినా ఉంటే బాగుంటుంది కదా అని అంటుంది కృష్ణ నువ్వు ఇంకా ముకుందని, అభిమానిస్తున్నావ్ కృష్ణ అని అంటే నాకు ఎప్పుడూ తనంటే అభిమానమేసిపి సార్ అని అంటుంది కృష్ణ. ఒక్కొక్కరి ఒక సెంటిమెంట్ కృష్ణ ముకుందని మనమేదో చేసామని ఆదర్శం అనుకుంటున్నాడు ఫోటో చూస్తే అదే గుర్తొస్తుంది అని తీసేయమన్నాడు అందులో తప్పేముంది అని అంటాడు నేను ఆదర్శ్ చెప్పినందుకు ఆలోచించట్లేదు ఏసీబీ సార్. మీరా ఎందుకు చెప్పింది మీరా తన ఫ్రెండే కదా అలాంటప్పుడు ఆ ముకుంద ఫోటో హాల్లో ఉంటే మీరాకు ఏంటి ప్రాబ్లం అదే ఆలోచిస్తున్నాను. హనీ కృష్ణ అనడంతో మురారి అందులో ఆలోచించేదేముంది తనకి కూడా తన ఫ్రెండు చనిపోయినందుకు బాధగా ఉందని ఆ ఫోటో చూసినప్పుడల్లా ఆ బాధ గుర్తొస్తుంది అని చెప్పింది కదా అని అంటాడు ఆదర్ చెప్తే ఓకే కానీ మీరా ఎందుకో తను చెప్పిన రీజన్ నాకు కరెక్ట్ అనిపించట్లేదు అని మురారితో కృష్ణ మీరా గురించి అనుమాన పడుతూ చెప్తుంది. చనిపోయిన వాళ్ళు దేవుడితో సమానం దండ వేస్తాము అలాంటప్పుడు మీరే ఎందుకు అలా అన్నది మీరు అంతరంగం ఏంటో అర్థం కావట్లేదు అని కృష్ణ అనడంతో మురారి తన ఆలోచన ఏదైనా తను మంచిదే నన్ను నమ్మి, నేను ముకుందని చంపడానికి కారణం అయి ఉండనని ఆలోచించి నన్ను విడిపించింది ఇక నువ్వు తన గురించి ఎక్కువ ఆలోచించకు అని మురారి సపోర్ట్ చేస్తాడు మీరాకి, కృష్ణ కూడా సరే అని అంటుంది ఇక కృష్ణ బట్టలు మడత పెడుతూ మురారి షర్ట్ కనిపించలేదని కంగారుగా వెతుకుతూ ఉంటుంది మళ్ళీ ఏమైంది కృష్ణ ఏమి వెతుకుతున్నావు అని అంటాడు.

Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights
Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights

ఇక కృష్ణ మీకు మా బాబాయి ఇచ్చిన షర్టు కనిపించట్లేదు. ఏ షర్టు అని అడుగుతాడు షర్టు కలర్ తో సహా కృష్ణ చెప్తుంది. దాంతో నువ్వు రెండు రోజులుగా బట్టలు ఆరేసావు కదా ఈ రెండు రోజుల్లో అవి గాలికి ఎగిరిపోయి ఉంటాయి నేను రాలేదన్న కంగారులో వాటిని తీయడం మర్చిపోయావు అని అంటే నేను ఆల్రెడీ క్లిప్ పెట్టాను ఏసీబీ సార్ అని అంటుంది క్లిప్పు పెడితే పెద్ద గాలి వస్తే ఎగిరిపోయి ఉంటుందిలే కృష్ణ అని అంటాడు. కానీ ఆ షర్ట్ అంటే నాకు చాలా ఇష్టం రెసిపి సార్ అని అంటుంది నాకు కూడా ఇష్టమే గార్డెన్లో ఏమైనా పడిందేమో నేను చూసేస్తాను అని మురారి వెళ్తాడు. మరోవైపు మురారి షర్ట్ ని మీరా తీసుకుంటుంది. మీరా ఆ షర్ట్ ని మంచం మీద పెట్టి అక్కడ మురారి ఉన్నట్టుగా ఊహించుకొని మురారి తనతో పాటు బెడ్ మీద పడుకోవడం అదంతా ఊహించుకుంటూ, మురారితో ఎప్పటికైనా నువ్వు నా వాడివే మురారి అని మాట్లాడుతూ ఉంటుంది ఇక కొంత టైం తర్వాత నేను బయటికి వెళ్లి వస్తాను అని ఆ షర్ట్ ని పట్టుకొని మురారితో చెబుతున్నట్లుగానే ఊహించుతూ చెప్తుంది. ఎక్కడికి అని అడుగుతున్నావా ఏం లేదు మురారి నేను ఒక ఉద్యోగం చేస్తున్నట్లు ఇంట్లో వాళ్లకి చెప్పాను కదా ఇప్పుడు ఆ ఉద్యోగానికి రిజైన్ చేయమని అత్తయ్య చెప్పింది కదా అందుకే బయటికి వెళ్లినట్టుగా వెళ్లి మా నాన్నని కలిసి ఆయనకి చెప్పాల్సిన జాగ్రత్తలు చెప్పి వస్తాను అని మురారితో మాట్లాడుతున్నట్టుగా మాట్లాడి బయటికి వస్తుంది ఆ షర్ట్ ని ఎవరికీ కనబడకుండా దిండు కింద పెట్టి వస్తుంది.మురారి తనకి ఎదురవుతాడు ఎక్కడికి వెళ్తున్నావు మీరా అని అడిగితే నేను చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను ఆఫీస్ లో డిజైన్ చేయడానికి అని అంటుంది దానికి నువ్వు ఒక్కదానివే వెళ్లడం ఎందుకు నువ్వు కృష్ణ ని తోడు తీసుకొని వెళ్ళు అని అంటాడు కృష్ణ ను తీసుకొని వెళ్తే నిజాలని బయటకు వస్తాయని మనసులో అనుకుంటుంది మీరా, పర్వాలేదు నేనే వెళ్తాను అని అంటుంది అన్నట్టు ఇందాకటి నుంచి మీరు ఏదో వెతుకుతున్నారు అని అడుగుతుంది మీరా నా షర్టు ఒకటి కనిపించట్లేదు అని అంటాడు అది నా దగ్గర ఉంది కదా అని అనుకుంటుంది మనసులో మీరా, ఆఫ్టర్ షర్టు కనపడిపోతేనే అంతలా వెతకాలా అని ఉంటుంది ఆ షర్ట్ అంటే నాకే కాదు మరి అది కనిపించట్లేదని టెన్షన్ పడుతోంది అని చెప్తాడు. సరే మీరు వెతుక్కోండి నేను బయటకు వెళ్లి వస్తాను అని బయటకు వెళ్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights
Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights

ఇక మీరా డైరెక్ట్ గా శ్రీనివాస్ ఇంటికి వెళ్తుంది అక్కడికి వెళ్లి ఎలా ఉన్నారు అని అడుగుతుంది శ్రీనివాస్ నేను బానే ఉన్నాను అని అంటాడు కూతుర్ని చూసి శ్రీనివాస్ చాలా సంతోషిస్తాడు నీ ముఖంలో చిరునవ్వు చూస్తుంటే చేరాల్సిన చోటికి చేరినట్టు ఉన్నావు కదా అని అంటాడు. అవును అని అంటుంది కానీ శ్రీనివాస్ నమ్మడు వెంటనే ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోని మీరా చూపిస్తుంది. నీకు ఇంకా కొద్ది రోజుల్లో నేను ఇంకో ఫోటో కూడా పంపిస్తాను నాన్న అని,తండ్రికి కొన్ని జాగ్రత్తలు చెప్పి నా ఫోటో ఇంట్లో ఉందా అని అడుగుతుంది. లేదు అని అంటాడు నువ్వు కూతురు ఫోటో చనిపోతే పెట్టుకోకపోతే బయట జనాలకి డౌట్ వస్తుంది. ముందు నువ్వు నా ఫోటో ఒకటి పెట్టి దానికి దండవెయ్యి అని అంటుంది అలా ఎలా చేస్తానమ్మా అని అంటాడు ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ పెట్టుకోకూడదు నాన్న ఇప్పుడు మనం దేవుడికి దండ వేస్తున్నాము అంటే ఈ ముకుంద కూడా దేవుడితో సమానం అనుకోని దండ వేయి అంటుంది అయినా నేను సమానమే అని అనుకోవడం కాదు నేను దేవుడిని అని అంటుంది. దేవుడు అవతారాలు ఎత్తినట్టు నేను కూడా ఇప్పుడు ముకుంద అవతారంలో నుంచి మీరు లాగా మారిపోయాను కదా అని అంటుంది. ఇక ముకుంద మాట్లాడే మాటలు వింటూ శ్రీనివాస్ సైలెంట్ గా ఉంటాడు. ఏంటి నాన్న సైలెంట్ గా ఉన్నావు ఇంతకీ ఇల్లు అమ్మేవా లేదా అని అంటుంది. అమ్మ లేదు అని అంటాడు తొందరగా అమ్మే నాన్న నాకు డబ్బు అవసరం ఉంది అని అంటే ఇప్పుడు నీకు డబ్బుతో అవసరం ఏముంది అని అడుగుతాడు శ్రీనివాస్ డబ్బుతో అవసరం ఏముంది అని అలా అడుగుతావు నాన్న నేను ఇప్పుడు అక్కడ మురారిని నా సొంతం చేసుకోవడానికి ఎంతమందిని మేనేజ్ చేయాలో తెలుసా మరి దానికి డబ్బు కావొద్దు అని అంటుంది. తొందరగా ఇల్లు అమ్మే ప్లాన్ చెయ్యి అని అంటుంది. ఫోటోలు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మురారి అనే వాడిని లేకుండా చేస్తే గాని, నా కూతురికి మనశ్శాంతి ఉండదు అని కాకపోతే అలా చేస్తే కృష్ణ బాధ పడుతుందని శ్రీనివాస తన మనసులో తానే ఆలోచించుకుంటూ ఏదో ఒక ప్లాన్ చేయాలి అని డిసైడ్ అవుతాడు.

Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights
Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights

ఇక మరోవైపు కృష్ణ మురారిని చూసి దెబ్బలు అన్ని తగ్గిపోయాయి ఎసిపి సార్ అని అంటే నేను పోలీస్ నై ఉండి పోలీస్ చేతిలోనే తన్నులు తినాల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదు అని అంటే దానికి కృష్ణ బాధపడుతుంది మనం ఎవరికీ ఏం అన్యాయం చేసాము మనకే ఇలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతుంది. ఇప్పుడేమైంది కృష్ణ ఏడుస్తున్నావు అంతా సర్దుకుంది కదా అని అంటే ఎక్కడ సర్దుకుందే చూపిస్తారు శ్రీనివాస్ బాబాయ్ మిమ్మల్ని వదిలిపెడతాడా అని అంటే మళ్ళీ ఏమైనా చేస్తాడేమో అని నాకు కంగారుగా ఉంది అని అంటుంది. మనల్ని విడిపించింది హోమ్ మినిస్టర్ రికమండేషన్ తో కృష్ణ నువ్వు కంగారు పడకు నా వెనుక హోమ్ మినిస్టర్ ఉన్నాడని ఆ శ్రీనివాసు ఏమీ ఆలోచించలే అని కృష్ణకు ధైర్యం చెప్తాడు మురారి కానీ కృష్ణ మాత్రం నాకెందుకు అనుమానంగానే ఉంది ఏసీపీ సార్ ఈసారి ఇంకెవరైనా పెద్దవాళ్లతో కలిసి మిమ్మల్ని ఏమన్నా చేస్తాడేమోనని భయంగా ఉంది అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights
Krishna Mukunda Murari Today Episode March 30  2024 Episode 432 highlights

రేపటి ఎపిసోడ్ లో మీరా ఆదర్శ్ కి మందులు తాగిస్తూ ఉంటుంది మెల్లిగా తాగండి సార్ ఇది మీ ఇల్లే కదా ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు అని అంటే అలా అనుకోవడం నా పిచ్చితనం ఇక్కడ ఉన్నానని కానీ ఇది నా ఇల్లు కాదు, అని అంటూ ఉంటే ముకుంద మనసులో తొందరగా ఆదర్శ్ మనసు మార్చేయాలి నేను ఈ ఇంట్లో మనిషిని అనుకునేలా చేయాలి అని ముకుంద ఫిక్స్ అవుతుంది. ఇక మరోవైపు ఆదర్శ మధు గొడవ పడుతూ ఉంటే భవాని దేవి వస్తుంది. ఏంటి ఆదర్శ గొడవ అని అంటుంది. నేను నీ కొడుకుని కాదు కదా అందుకే నేను ఇంట్లో అందరికీ లోకువైపోయాను, నన్ను పరాయి వాళ్ళని చూసినట్టుగా చూస్తున్నారమ్మ అని అంటే నువ్వు సొంత వాడిగా ఫీల్ అవ్వాలంటే ఇంకేం చేయాలి మేము అని అంటుంది భవాని దేవి. ఈ ఇల్లు ఆస్తులు మొత్తం నా పేరు మీద రాసే అప్పుడు నేనే డిసైడ్ చేస్తాను ఇంట్లో ఎవరు ఉండాలి ఎవరు ఉండకూడదని అని అంటాడు ఆదర్శ ఆ మాటకు భవానీ దేవితో పాటు ఇంట్లో అందరూ కూడా షాక్ అవుతారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N