ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్లో రోజుకు 4 ఆటలను ప్రదర్శిస్తున్నారు. అయితే చిన్న సినిమాల కోసం ఐదవ ఆటకు పర్మిషన్ను ఇవ్వాలని చిన్న నిర్మాతలు ప్రభుత్వాలను కోరుతున్నారు. చిన్న నిర్మాతల అభ్యర్థనను ప్రభుత్వాలు కూడా పరిశీలిస్తున్నాయి. అయితే మన పక్క రాష్ట్రమైన తమిళనాడు ఈ విషయంలో ముందడుగు వేసింది. ఇకపై 24 గంటల పాటు సినిమా థియేటర్స్ ఓపెన్లో ఉండేలా చర్యలు తీసుకుంటుందని తర్వలోనే జీవో కూడా జారీ కానుందని కోలీవుడ్లో వార్తలు వినపడుతున్నాయి. ఇలా 24 గంటల పాటు థియేటర్స్ ఓపెన్లో ఉంటే.. చిన్న నిర్మాతలకు వారి సినిమాలను ప్రదర్శించుకునే వీలుంటుంది.
previous post
next post