NewsOrbit
Right Side Videos

వీధి రౌడీ కాదు – ప్రజాప్రతినిధి

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అతను ఒక బిజెపి ప్రజాప్రతినిధి, సీనియర్ నేత కుమారుడు. అదే అతని లైసెన్సు. అతను ఏమి చేసినా అడిగేవారు ఉండరు అనే ధైర్యం. క్రికెట్ బ్యాట్‌తో మున్సిపల్ కార్పోరేషన్ అధికారినే చితకబాదాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాల్‌చల్ చేస్తోంది.

ఇండోర్‌లో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సమయంలో బిజెపి ఎమ్మెల్యే అకాశ్ విజయ్ వర్గియా అక్కడకు చేరుకొని మున్సిపల్ కార్పోరేషన్ అధికారులతో గొడవకు దిగారు. సహనం కోల్పోయిన ఎమ్మెల్యే ఆకాశ్ తాను ప్రజాప్రతినిధిని అన్న ధ్యాస కూడా లేకుండా ఒక వీధి రౌడీలా క్రికెట్ బ్యాట్‌తో అధికారిని కొట్టాడు. అక్కడ ఉన్న వారు అడ్డుకున్నా ఆయన మాత్రం వదలకుండా చితకబాదాడు.

అయితే ఈ ఘటనను ఎమ్మెల్యే ఆకాష్ సమర్థించుకున్నారు. ప్రజాప్రతినిధిగా అధికారులు, ప్రజల మధ్య సమస్యలను పరిష్కరించడం తన బాధ్యత అని ఆకాశ్ చెప్పుకొచ్చారు. స్పెషల్ డ్రైవ్ పేరిట ఆ ఆఫీసర్ దాదాగిరి చేస్తూ ప్రజలను ఇబ్బందులు పెడుతున్నాడని ఆకాశ్ ఆరోపించారు. అందుకే తనలో ఆవేశం కట్టలు తెంచుకుందని అకాశ్ అన్నారు. ఈ ఘటనపై ఏమి జరుగుతుందో చూద్దాం అంటూ ఆకాశ్ తాపీగా పేర్కొన్నారు.

ఆకాష్ విజయ్ వర్గియా సీనియర్ బిజెపి నేత కైలాష్ విజయ్ వర్గియా కుమారుడు.

బాధిత అధికారి ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకొని ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు నేడు ఎమ్మెల్యే ఆకాష్ విజయ్ వర్గియాను అరెస్టు చేశారు. ఘటనపై రాష్ట్ర హోం మంత్రి బాల బచ్చన్ స్పందించారు. ఇది బిజెపి నేతల స్వభావమని బచ్చన్ అన్నారు. ప్రజాప్రతినిధులు వారు నియంత్రించలేరని బచ్చన్ వ్యాఖ్యానించారు. వారిపై కఠన చర్యలు తీసుకుంటామని మంత్రి బచ్చన్ పేర్కొన్నారు.

 

ఎఎన్ఐ సౌజన్యంతో వీడియో…..

Related posts

కర్ణాటక లో సాగుతున్న భారత్ జోడో యాత్రలో రాహుల్ తో కలిసి సోనియా నడక

sharma somaraju

Video Viral: బాలుడిని గాయపర్చి కుక్క .. యజమానిపై కేసు నమోదు…ఎందుకంటే..?

sharma somaraju

Viral video: రీల్స్ మోజులో రైల్ ఢీకొని..

sharma somaraju

వీడియో : డ్రోన్ కి చిక్కిన మావో బలగాలు, పోలీసుల అప్రమత్తం..!

sharma somaraju

కరోనాతో కొత్త సమస్యలు: కంటే కన్నీళ్లు ఆగవు..!!

sharma somaraju

దగ్గుబాటి వారి పాకశాల…!

sharma somaraju

రాజుగారా…! మజాకా..!

sharma somaraju

చార్మీకి డ్రగ్స్ మైకం కమ్మిందేమో…!

sharma somaraju

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju

కొత్తూరు తాడేపల్లిలో ఎంఆర్ఒపై రైతుల ఆగ్రహం

sharma somaraju

విన్నూత్నంగా ‘ఎన్ ఆర్ ఐ’ ఎంగేజ్మెంట్ ఫంక్షన్

sharma somaraju

రోడ్డుపై రెచ్చిపోయిన బస్ డ్రైవర్!

Mahesh

ఫ్యాన్స్‌ని చూసి భయపడిన సన్నీ!

Mahesh

‘ఆడుకుందాం రా’ అంటున్న ఏనుగు!

Mahesh

సెల్ఫీకి ప్రయత్నం.. సల్మాన్ ఆగ్రహం!

Mahesh

Leave a Comment