NewsOrbit
న్యూస్

పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం

హైదరాబాద్: కృష్ణాజిల్లాకు చెందిన ఐరన్ ట్రేడింగ్ వ్యాపారి తేలప్రోలు రాంప్రసాద్ హత్య కేసులో కొత్త కోణం వెలుగుచూసింది. వ్యాపార లావాదేవీల్లో జరిగిన గొడవలే హత్యకు కారణమని హతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

శనివారం రాత్రి రాంప్రసాద్ పంజాగుట్ట వెంకటేశ్వరస్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రాంప్రసాద్‌ను సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నేటి తెల్లవారుజామున మృతి చెందారు.

రాంప్రసాద్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విజయవాడ కొండపల్లి సమీపంలో కోగంటి సత్యంకు చెందిన కామాక్షి స్టీల్ ప్లాంట్‌లో గతంలో రాంప్రసాద్ భాగస్వామిగా ఉన్నారు. వ్యాపార భాగస్వామి కోగంటి సత్యంతో పాతకక్షలు ఉన్నాయనీ, అతని నుండి తరచు బెదిరింపులు వచ్చేవని, ఆయనే కిరాయి హంతకులతో హత్య చేయించి ఉంటారని కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోగంటి సత్యంపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

అయితే ఈ హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోగంటి సత్యం స్పష్టం చేశారు.కామాక్షి స్టీల్స్‌లో తనతో పాటు బొండా ఉమా కూడ వ్యాపార భాగస్వామిగా ఉన్నారనీ, ఆయన రాజకీయాల్లోకి వెళ్లే ముందు ఆయన వాటా కింద ఉన్న షేర్లను రాంప్రసాద్‌కు విక్రయించారని కోగంటి చెప్పారు. 2013లో రాంప్రసాద్ స్ర్కాప్ సప్లై చేసిన కొంత మందికి, కంపెనీకి సుమారు 70కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పారిపోయాడని కోగంటి సత్యం తెలిపారు. తనకే 23కోట్ల రూపాయలు అతని వద్ద నుండి రావాల్సి ఉందని సత్యం అన్నారు. ఆయన్ను హత్య చేయిస్తే తనకు రావాల్సిన డబ్బు ఎలా వస్తుందని కోగంటి ప్రశ్నించారు. రాజకీయ దురుద్దేశంతోనే టిడిపి వాళ్లు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కోగంటి ఆరోపించారు. తనపై 19కేసులు ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోందనీ, అది నిజం కాదనీ, మూడు కేసులు మాత్రమే ఉన్నాయని కోగంటి తెలిపారు.  మూడు రోజుల క్రితం తాను తిరుపతి వెళ్లాననీ అక్కడ నుండి చికిత్స కోసం హైదరాబాదుకు తిరిగి వచ్చినట్లు కోగంటి తెలిపారు. రాంప్రసాద్‌ను తాను ఏనాడూ కూడ బెదిరించలేదని ఆయన చెప్పారు. రాంప్రసాద్ హత్య విషయంలో పోలీసుల విచారణకు తాను సహకరిస్తానని కోగంటి పేర్కొన్నారు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Leave a Comment