NewsOrbit
రాజ‌కీయాలు

‘ఇసుక కొరత లేకపోతే వారోత్సవాలు ఎందుకో?’

విజయవాడ: ఏపీలో ఇసుక కొరత సృష్టించారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత లేదంటూ వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ‘అయ్యా విజయ సాయిరెడ్డి గారూ… ఇసుక కొరత లేదని ట్విట్టర్ లో మీరు సెలవిచ్చారు. బాగానే ఉంది, మరి మీ మేధావి సీఎం జగన్ ఇసుక వారోత్సవాలు ఎందుకు చేస్తున్నట్టు? ట్రాక్టర్ డ్రైవర్లపై మీ వైసీపీ ఇసుక మాఫియా దాడులు చేసి ఇసుకను ఎత్తుకుపోతోంది. అడ్డొస్తే చంపడానికి కూడా వెనకాడడంలేదు’ అని ట్వీట్ చేశారు.

‘రాష్ట్రంలో కృత్రిమ ఇసుక కొరత సృష్టించి పందికొక్కుల్లా ఇసుకని తింటూ, భవన నిర్మాణ కార్మికులని మింగేస్తున్న మీరు ఇసుక గురించి నీతులు మాట్లాడుతున్నారా విజయసాయిరెడ్డి గారు? పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడడం లేదన్నట్లుగా ఉంది మీ వ్యవహారం. దమ్ముంటే ఇసుక కొరత లేదని ప్రజల్లోకి వెళ్లి చెప్పండి?’ అని బుద్ధా వెంకన్న ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

‘అధికారం వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజలు ఛీ కొట్టడాన్ని భరించలేక వైఎస్ జగన్ కి మతిస్థిమితం పోవడంతో మీకు మెదడు మోకాల్లోకి జారినట్టు ఉంది విజయసాయి రెడ్డి గారు. రాష్ట్రం ఆత్మహత్యలతో అట్టుడుకుతుంటే మీరు, మీ ముఖ్యమంత్రి గారు ఫిడేలు వాయించుకుంటున్నారు. మిమ్మల్ని చూసి సిగ్గే సిగ్గుపడుతుంది. చంద్రబాబు గారి హయాంలో ముఖ్యమంత్రి ఈ-ఐ కేంద్రాల్లో ప్రజలు అంతా కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కంటి వెలుగు పథకంలో కంటి పరీక్ష చేయించుకోవాల్సింది విజయసాయిరెడ్డి ఒక్కరే! మీకు చత్వారం రావడం వలనే అమరావతిలో జరిగిన నిర్మాణాలు కనపడటం లేదు. వయసుకూడా పెరుగుతోంది కదా. అమరావతి గ్రాఫిక్స్ ఐతే, చంద్రబాబుగారు నిర్మించిన సచివాలయం నుండి పాలన ఎవరు చేస్తున్నట్టు? హైకోర్టు గ్రాఫిక్ అంటున్నారు, త్వరలో వెళ్తారుగా అప్పుడు మీకు మబ్బులు వీడడం ఖాయం.అధికారం వచ్చిన 5 నెలల్లో అమరావతిని ఎడారి చేసిన సిగ్గులేని జన్మ మీది,మీ సీఎం వైఎస్ జగన్ గారిది విసారెడ్డి గారూ! అని బుద్ధా వరుస ట్వీట్లు చేశారు.

https://twitter.com/BuddaVenkanna/status/1189493514133856257

https://twitter.com/BuddaVenkanna/status/1189487489691504641

Related posts

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Leave a Comment