NewsOrbit
రాజ‌కీయాలు

ప్రణాళిక లేకుండా తెలుగు మీడియంను ఎత్తేస్తారా?

విజయవాడ: ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. గతంలో ఇదే నిర్ణయాన్ని చంద్రబాబు సర్కారు ప్రకటిస్తే తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ నేతలు ఇప్పుడు మాత్రం మరోలా మాట్లాడుతున్నారని ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘నిరా రక్షత, దీవితాన్ని, సంఘ సస్కర్తలు, రాజిక సౌద్దన్నాన్ని అని మీ తింగరి మాలోకం చదివిన తరువాత మీకు తెలుగుపై కోపం రావడం సహజం. చూసి చదవడం రానంత మాత్రాన ఎటువంటి ప్రణాళిక లేకుండా ఉన్నట్టుండి తెలుగు మీడియం స్కూల్స్ అన్నిటినీ ఇంగ్లిష్ మీడియంగా చేసేస్తాం అంటే ఎలా ఎంపీ విజయసాయి రెడ్డి గారు?’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

‘అన్నట్టు మీ దొంగ మీడియాలో రాసేవి అన్ని అసత్యాలు అని మీరే ఒప్పుకోవడం హైలైట్. చంద్రబాబు గారు ఇంగ్లిష్ మీడియం స్కూల్స్ పెడతానంటే మీ తెలుగు లెస్సేనా, ఎందుకింత తెగులు అని మీ పత్రిక రాసింది. కాస్తయినా మీలో సిగ్గు ఉంటే, నీచంగా చిన్న పిల్లల గురించి ఇక మీదట ట్వీట్స్ పెట్టరని అనుకుంటున్నాను’ అని వరుస ట్వీట్లు చేశారు.

అగ్రి గోల్డ్ బాధితుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనబర్చుతోన్న తీరుపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న స్పందిస్తూ విమర్శలు గుప్పించారు. ‘ఆస్తులు కొనడానికి ముందుకొచ్చిన కంపెనీలను తమరు స్వయంగా బెదిరించారు గుర్తులేదా? అగ్రి గోల్డ్ గాయాన్ని పుండు చేసి ఆయింట్మెంట్ రాస్తున్నట్టు ఆ బిల్డ్అప్ లు ఆపండి. చిత్తశుద్ధి ఉంటే దగా యాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం వారంలో రూ.1,150 కోట్లు జగన్ గారితో విడుదల చేయించండి విజయసాయి రెడ్డి గారు’ అని డిమాండ్ చేశారు.

‘ఎటెట్టా ప్రజా దగా యాత్రలో ఇచ్చిన హామీని జగన్ గారు నిలబెట్టుకున్నారా? చంద్రబాబు గారు కేటాయించిన రూ.363 కోట్లలో కోత పెట్టి రూ.264 కోట్లు మాత్రమే ఇచ్చారు. విజయవాడ, హైదరాబాద్ హోటల్స్ లో కూర్చొని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా కేసులు వేయించిన విషయం మర్చిపోయారా?’ అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు.

Related posts

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

Leave a Comment