NewsOrbit
రాజ‌కీయాలు

‘దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి’

విజయవాడ: వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. జగన్ చేసే అన్ని పనులకు డైరెక్షన్ విజయసాయిరెడ్డేనంటూ ట్వీట్ చేశారు. జగన్ దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయాలని అని డిమాండ్ చేశారు. “జగన్ గారికి చిల్లర సలహాలు ఇచ్చే ముఖ్య సలహాదారుడు మీరే కదా పెద్దారెడ్డి. తండ్రి శవం చూడకుండానే సంతకాలు పెట్టమని జోలె పట్టి అడుక్కునే సలహా, పెద్ద రోగంతో పోయిన వాడు కూడా మా మహా మేత కోసం పోయారు అంటూ బిల్డ్ అప్ యాత్ర. పాదయాత్రలో సబ్బుతో స్నానం చేయించి ముద్దులు ఇవ్వడం. ట్రైన్లు, పచ్చని పొలాలు తగల బెట్టి మొసలి కన్నీరు కార్చడం. డ్రామా కంపెనీని తలపించేలా యాక్షన్ సీన్లు ఇలా ఒక్కటేంటి అనేక చెత్త పనులకు మీరే డైరెక్టర్ కదా విజయసాయి రెడ్డి గారు!” అని బుద్దా వెంకన్న ట్వీట్‌లో పేర్కొన్నారు.

“లక్షకోట్ల ప్రజాధనం దొబ్బి, కోర్టులో ప్రతి వారం జడ్జిగారి ముందు అయ్యా అని చేతులు కట్టుకొని నిలబడే మీరు, జగన్ గారా చంద్రబాబు గారి స్వభావం గురించి మాట్లాడేది విజయసాయిరెడ్డి గారు? దోచిన లక్షకోట్లు ప్రభుత్వానికి ఇచ్చేయండి. మీరు చెప్పినట్టే అప్పులేకుండా రాజధాని నిర్మాణం అయ్యిపోద్ది. లూటీ చేసే చరిత్ర జగన్ గారిది, తన బాధని ప్రపంచ బాధగా తానే ఒప్పుకున్న దొంగ పత్రికలో మోత మోగిస్తాడు. మీరు చెప్పింది నిజమే సోషల్ మీడియాలో నిజాలు తెలుస్తున్న తరువాత మీ చెత్త పేపర్ ని తుడుచుకోవడానికి తప్ప దేనికి ఉపయోగించడం లేదు ప్రజలు సాయి రెడ్డి గారు ”అని వరుస ట్వీట్లు చేశారు.

Related posts

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

YS Sharmila: మోడీకి జగన్ దత్తపుత్రుడు – వైఎస్ షర్మిల  

sharma somaraju

PM Modi: డబుల్ ఇంజన్ సర్కార్ తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం – మోడీ

sharma somaraju

BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు చుక్కెదురు .. బెయిల్ పిటిషన్లు డిస్మిస్

sharma somaraju

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Leave a Comment