NewsOrbit
న్యూస్

జగన్ ప్రభుత్వం యొక్క బలం అదే! బలహీనత అదే!!

ఇటు వైసిపిలోనూ, అటు తెలుగుదేశం పార్టీలోనూ చూసుకుంటే రెండు వైపులా అసమ్మతి ఉంది. రెండు పార్టీలలోనూ నిరసన సెగలు రగులుతున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మరి అవి ముదిరేలోపే చక్కదిద్దుకోకపోతే అధినేతలకే అసలు ముప్పు అని కూడా అంటున్నారు.విషయానికి వస్తే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఒకే రకమైన సమస్యను ఎదుర్కొంటున్నాయి. అదే అసంతృప్తి. రెండు పార్టీలలోనూ అధినేతల మీదనే ఈ అసమ్మతి రాగాలు గట్టిగా వినిపిస్తున్నాయి.



బంపర్ మెజారిటీ కూడా ఎపుడు బరువే. 151 సీట్లు వైసీపీకి రాగానే బరువు భరించలేనిదిగా మారింది. ఈ విజయం ఎంతలా పార్టీని ప్రభావితం చేసింది అంటే జగన్ సైతం తన ఎమ్మెల్యేలను కలసి అచ్చంగా ఏడాది అవుతోందిట. అంటే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉండడం వల్ల జగన్ సైతం వారిని సులువుగా కలుసుకోలేని స్థితి. ఇక అసెంబ్లీ అంతా మనవాళ్ళే అన్న ధీమా కూడా హై కమాండ్ కి ఉంటే మమ్మల్ని పట్టించుకోవడంలేదన్నది వైసీపీ ఎమ్మెల్యేల బాధ. దాని నుంచే అసమ్మతి స్వరం హెచ్చుగా మారి నిరసన‌ రాగమాలపిస్తోంది

ఎమ్మెల్యేలు అంటే ఏదో కనిపించాలిగా. దర్జా, దర్పంతో పాటు పనులు కూడా జరగాలి. ఇక అన్ని రకాలుగా లాభపడాలి కూడా. కానీ జగన్ మూతులు కట్టేయడంతో వారంతా దిక్కుతోచక గిలగిలలాడుతున్నారు. మా సర్కార్ బాగుంది. అవినీతి లేదు అనుకుంటే బాగానే ఉంటుంది. కానీ కోట్లు ఖర్చు పెట్టి గెలిచిన వారికి సంతోషం ఎక్కడ ఉంటుంది.అందుకే వారంతా గత తెలుగుదేశం ప్రభుత్వం మేలు,ఎమ్మెల్యేలే అప్పుడు రాజ్యం మేలారని వాపోతున్నారు ఈ మధ్య ఆనం రామనారాయణరెడ్డి ,మహీధరరెడ్డి ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్లు గళం విప్పటం వైసీపీ అధినేతకు వార్నింగ్ బెల్లు గానే పరిగణించాలి
మరో వైపు టీడీపీలో చూసుకుంటే సీనియర్లు కూడా ఆ పార్టీని విమర్శిస్తున్నారు. కరణం బలరాం లాంటి వారు ఎన్టీయార్ కాలం నుంచి ఉన్నారు. పార్టీ సొంత సామాజికవర్గానికి చెందిన వారు. వారు ఇపుడు చంద్రబాబు అసమర్ధుడు అంటూంటే మొదటికే మోసంగా పార్టీ తీరు తయారైందనిపిస్తుంది. టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగి ఫ్యాన్ నీడకు చేరుతారు అని జోస్యాలు చెబుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ లాంటి వారు సైతం మౌనంగా ఉంటూ జగన్ కి మద్దతు ఇస్తున్నారు. వీటిని చూసుకుని వైసీపీ మా పాలన బాగుందని మురిసిపోతూంటే, వైసీపీలో అసమ్మతి ఎమ్మెల్యేలు, ఎంపీల నిరసనలను వినిపించి జగన్ సర్కార్ కి కౌంట్ డౌన్ మొదలైంది అని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు లాంటి వారు అంటున్నారు. మొత్తం మీద దొందూదొందు గానే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


 



Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju