వర్కవుట్ ముందు తినే ఆహారం సరైనది కాకపోతే అసలుకే మోసం వస్తుంది. ఎంత వర్కవుట్ చేసినా వేస్టయిపోతుంది. అందువల్ల ఈ వర్కవుట్స్ చేసే ముందు ఎలాంటి ఆహారం తీసుకోకూడదో తెలుసుకుందాం.
తియ్యగా, గ్యాస్‌తో ఉండే కూల్ డ్రింక్స్‌ని వర్కవుట్స్ ముందు తాగడం ఎంత మాత్రం మంచిది కాదు. వర్కవుట్స్ చేస్తున్నప్పుడు పొట్టలో గడబిడ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. వికారం, వాంతులు అయ్యే ప్రమాదంఉంది పైగా ఆ డ్రింక్స్‌లో పెద్ద మొత్తంలో షుగర్ ఉంటుంది. అది బాడీలో గ్లూకోజ్‌గా మారి, బరువును పెంచుతుంది.
కాబట్టి వర్కవుట్‌కి రెండు నుంచీ మూడు గంటల ముందు, రెండు నుంచీ మూడు గ్లాసుల నీరు తాగితే అది ఎంతో మేలు చేస్తుంది. సాధారణంగా చాలా మంది ఉదయాన్నే ఓ గ్లాస్ పాలు తాగేసి వర్కవుట్ చేస్తుంటారు. కానీ, ఇది సరైన నిర్ణయం కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పాలు తాగికూల్ డ్రింక్స్ బదులు గ్లాస్ మంచినీళ్లు తాగితే ఎంతో మేలు. వర్కవుట్ చేస్తే, అవి వెంటనే జీర్ణం కాకపోవడంతో పాటు పొట్టలోనే ఉండి వికారం తెప్పిస్తాయి. వాటి నుంచీ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. దీంతో వర్కవుట్ చేస్తుంటే చాలా ఇబ్బంది పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది.
అలాగే వర్కవుట్‌కి ముందు చిల్లీ నూడుల్స్ వంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదు.స్పైసీ ఐటెమ్స్ గుండెకు హాని చేస్తాయి. అదే సమయంలో వర్కవుట్స్‌లో అసౌకర్యం కలిగిస్తాయి. ఇక వర్కవుట్ చేసేటప్పుడు పొట్టలో ఇబ్బంది గా అనిపిస్తుంది. అందుకే వర్కవుట్ చేసేముందు వీటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా.. గింజలు, తృణధాన్యాలు కూడా వర్కవుట్ చేసే ముందు తీసుకోకూడదు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్స్ ఎక్కువ. మరియు ఫైబర్ కూడా ఎక్కువే. అందుకే ఇవి జీర్ణం కావడానికి టైమ్ తీసుకుంటాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవటమే మంచిది.