NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

పవన్ స్పందన వ్యూహమా?…ఉద్రేకమా?

టిడిపితో జనసేన పొత్తు విషయమై తాజా వరుస పరిణామాలు, ఫలితంగా చోటుచేసుకున్న రగడ ఎపి రాజకీయాలను ఒక్కసారిగా తీవ్రంగా వేడెక్కించింది. అయితే ఈ వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యపరిచింది. కారణం అది తమ ఊహకు పూర్తి భిన్నంగా ఉండటమే.

దీంతో పవన్ కళ్యాణ్ అనూహ్య స్పందనకు కారణాలేమై ఉండొచ్చంటూ వారు వివిధ కోణాల్లో విశ్లేషణలు సాగిస్తున్నారు. పవన్ స్పందన అనేది ఒక సినిమా స్టార్ గా సమస్యలపై అప్పటికప్పుడు స్పందించే లాంటి ఉద్వేగమా?…లేక వ్యూహాత్మకమా?…అనేది అప్పుడే అంచనా వేయలేకపోతున్నారు. అయితే జనసేనలో ప్రస్తుతం అభ్యర్థుల ఖరారు ప్రక్రియ జరుగుతుందంటూ వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ పరిణామాలు చోటుచేసుకోవడాన్ని ఆ కోణంలోనూ విశ్లేషించాల్సి ఉంటుందంటున్నారు.

ఇక టిడిపి-జనసేన పొత్తు విషయమై తాజా వివాదం విషయంలో వరుస పరిణామాలు గమనిస్తే ముందుగా టిడిపి రాజ్యసభ ఎంపి టిజి వెంకటేష్ తమ పార్టీతో జనసేన పొత్తు విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎపిలో టిడిపి- జ‌న‌సేన క‌లిసే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని…యుపిలో ఎస్పీ, బీఎస్పీనే కలిసినప్పుడు…టీడీపీ, జనసేన కలిస్తే తప్పేమిటని టీజీ వెంకటేష్‌ ప్రశ్నించారు.

పైగా ఆయన ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వచ్చిన అనంతరం చేయడంతో ఆ వ్యాఖ్యలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో జనసేనతో పొత్తు విషయమై ఎంపి టిజి వెంకటేష్ తో సిఎం చంద్రబాబు ఏదో మాట్లాడివుంటారని, ఆ ప్రభావంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అందరూ భావించారు.

అయితే టిడిపితో జనసేన పొత్తు ఉండొచ్చంటూ ఎంపి టిజి వెంకటేష్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిన వెంటనే ప్రస్తుతం విశాఖ జిల్లా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న జనసేన అధ్యక్షుడు ప‌వ‌న్ కళ్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తమ పార్టీ గురించి ఎవరైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే వారిని వ‌దిలే ప్ర‌సక్తి లేద‌న్నారు. ఏమీ తెలియకుండా నోటికి ఏది వ‌స్తే అది మాట్లాడవ‌ద్ద‌న్నారు. తాను వద్దనుకున్న రాజ్యసభ సీటును తెచ్చుకున్న టీజీ వెంకటేష్ కు ఈ విషయమై తగిన బుద్ధి చెబుతానని…ఏదో పెద్ద మనిషి కదా అని ఇంకా గౌరవమిచ్చి మాట్లాడుతున్నానని, అయితే తాను నోరు అదుపు తప్పి మాట్లాడితే ఏమవుతారో తెలుసుకోవాలని హెచ్చరించారు. అసలు టిజి వెంకటేష్ ఒక పారిశ్రామికవేత్తగా నదులను, పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. మరోవైపు గిరిజన నేతలు కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమ చనిపోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

టిడిపితో పొత్తు విషయమై టిడిపి ఎంపి టిజి వెంకటేష్ వ్యాఖ్యలు,వాటిపై పవన్ కళ్యాణ్ మండిపాటు గురించి తెలియడంతో ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వెంటనే ప్రతిస్పందించి ఈ వివాదంపై తమ ఎార్టీ ఎంపి టిజి వెంకటేష్ తీరునే ఆయన తప్పుపట్టారు. ఆయన వ్యాఖ్యలు సరికాదని అన్నారు.
అయినా పార్టీ పాలసీ విధానాలపై వ్యక్తిగత ప్రకటనలు చేయడం ఏమిటని, అది కరెక్ట్ కాదంటూ టీజీ వెంకేటష్ పైన ఫైర్ అయ్యారు. అయినా అతి త్వరలో ఎన్నికలు వస్తున్నతరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అవగాహన లేకుండా ఈ విధమైన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణులను అయోమయానికి గురి చేయవద్దన్నారు. ఎవరైనా పార్టీ విధానాల పై వ్యాఖ్యానించే సమయంలో ఏమాత్రం సంయమనం కోల్పోవద్దని చంద్రబాబు హితవు పలికారు.

అయితే టిడిపితో జనసేన పొత్తు విషయమై వ్యాఖ్యల నేపథ్యంలో తలెత్తిన తాజా వివాదం ఇంతగా ప్రాధాన్యత సంతరించుకోవడానికి దీని వెనుకున్న నేపథ్యమేనని చెప్పుకోవచ్చు. ఇటీవలి కొంతకాలంగా జనసేనతో పొత్తు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం, అయితే ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందిస్తున్న తరహాలో టిడిపి కంటే ప్రధానంగా ప్రతిపక్షం వైసిపినే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్లు ఆ పార్టీ పై విమర్శల డోస్ పెంచడం, అంతేకాకుండా చంద్రబాబు ను దెబ్బతీసేందుకే టిఆర్ఎస్-వైసిపి కలుస్తున్నాయని, అది కరెక్ట్ కాదని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇక టిడిపి-జనసేన మళ్లీ కలిసిపోతాయనే ప్రచారం ఊపందుకోవడానికి, ఎక్కువమంది ఆ ప్రచారాన్ని విశ్వసించడానికి ఈ పరిణామాలు తోడ్పడ్డాయి. అంతేకాదు ఏకంగా ఈ రెండు పార్టీల మధ్య సీట్ల సర్థుబాటు ఇలా ఉండొచ్చంటూ విశ్లేషణలు కూడా జోరందుకున్నాయి.

ఈ క్రమంలో టిడిపి ఎంపి టిజి వెంకటేష్ సిఎం చంద్రబాబుతో భేటీ అనంతరం జనసేనతో పొత్తు విషయమై వ్యాఖ్యలు చేయగా పవన్ కళ్యాణ్ వాటిపై ఇంత తీవ్రస్థాయిలో మండిపడతారని ఎవరూ ఊహించలేదు. అయితే టిడిపితో పొత్తు విషయమై పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఫైర్ అవ్వడం వెనుక ఏదైనా వ్యూహం ఉందా?…లేక పొత్తు వంటి ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం గురించి తాను ఏమీ చెప్పకుండానే ఒక టిడిపి ఎంపి తనంతట తానుగా ఏకపక్షంగా మాట్లాడటమేమిటి?…అన్న ఉక్రోషం కారణంగా పవన్ కళ్యాణ్ ఈ విధంగా ప్రతిస్పందించారా?…అనేది రాజకీయ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పవన్ వ్యవహార శైలిని బట్టి చూస్తే ఆయన తాజా ప్రతిస్పందన వెనుక ప్రత్యేక వ్యూహం వంటిదేదీ ఉండకపోవచ్చని, సమస్యల విషయమై పలు సందర్భాల్లో ఉద్రేకంతో స్పందించిన పవన్ ఇప్పుడు కూడా అదే విధంగా స్పందించి ఉండవచ్చంటున్నారు.

అయితే మరికొందరు మాత్రం సిఎం చంద్రబాబుతో ఎంపి టిజి వెంకటేష్ భేటీ సందర్భంగా పవన్ తో పొత్తు విషయమై ప్రస్తావన వచ్చి ఉండవచ్చని…అందుకే ఎంపి టిజి ఆ విషయం గురించి మాట్లాడారని అంటుండగా…మరికొందరేమో తమతో పొత్తు విషయమై పవన్ అభిప్రాయం ఏమిటో తెలుసుకునేందుకు చంద్రబాబే ఆ విధంగా మాట్లాడించినా ఆశ్ఛర్యం లేదంటున్నారు.

అయితే ప్రస్తుతం ఎపి రాజకీయాల్లో పార్టీల పొత్తుల విషయాలే అత్యంత కీలకంగా మారడం, అవి పార్టీల పట్ల ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటం…అలాంటి సున్నిత సమయంలో ఈ పొత్తు వ్యాఖ్యల వల్ల తమ పార్టీ ఇమేజ్ కు డ్యామేజ్ జరగొచ్చనే అంచనాతో పవన్ వాటిని తీవ్రంగా ఖండించి ఉండొచ్చంటున్నారు. పైగా జనసేనలో అభ్యర్థుల ఎంపికకి కసరత్తు జరుగుతుందని ఒకవైపు వార్తలు వస్తుండగా, ఒకవేళ అదే నిజమైతే ఈ ప్రచారం తమ అభ్యర్థుల గెలుపోటములపై సైతం ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే ముందు జాగ్రత్తగా పవన్ ఈ పొత్తు వ్యాఖ్యలను ఇలా కొట్టిపడేసి వుండొచ్చని విశ్లేషిస్తున్నారు. టిడిపితో పొత్తు పెట్టుకోవడం నిజంగా పవన్ కళ్యాణ్ కు ఇష్టం లేకపోవడం వల్లే ఆయన ఇంత తీవ్రంగా రియాక్ట్ అయ్యారని, మరోసారి అలాంటి అనుమానాలకు తావులేకుండా సిఎం చంద్రబాబును కూడా వదలకుండా దుయ్యబట్టారనేది మరికొందరి అభిప్రాయం. అయితే సార్వత్రిక ఎన్నికలకు ఎంతో సమయం లేనందున టిడిపి-జనసేన ఒక వేళ పొత్తు పెట్టుకోదలిస్తే అది ఎంతో కాలం దాచి ఉంచే అవకాశం లేదు.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Leave a Comment