NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Ganesh Festival: ఏపిలో హాట్ టాపిక్‌గా గణేష్ ఉత్సవాల రగడ..! నేడు గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు..!!

Ganesh Festival: ఆంధ్రప్రదేశ్ లో గణేష్ ఉత్సవాల రగడ హాట్ టాపిక్ గా మారింది. కరోనా నిబంధనల పేరుతో ఏపి ప్రభుత్వం గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడాన్ని బీజేపీ, టీడీపీ నేతలు తప్పుబడుతున్నారు. వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమాలకు లేని ఆంక్షలు వినాయక చవితి వేడుకలకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణలో గణేష్ ఉత్సవాలకు అక్కడి కేసిఆర్ సర్కార్ ఎలాంటి ఆంక్షలు విధంచలేదని గుర్తు చేస్తున్నారు. అయితే బీజేపీ నేతల విమర్శలపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే గణేష్ ఉత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పుకొస్తున్నారు. అయితే కేంద్ర ఆదేశాలు ఉంటే అవి తెలంగాణకు వర్తించవా, తెలంగాణలో ఇండియాలో అంతర్భాగం కాదా అని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో కేంద్రం మార్గదర్శకాలు జారీ చేస్తే అవి అన్ని రాష్ట్రాలు అమలు చేయాల్సిందే. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఏపిలోనే ఆంక్షలు విధించడంపై పెద్ద ఎత్తున ఆక్షేపణలు వస్తున్నాయి. కర్నాటక రాష్ట్రంలోనూ అయిదు రోజుల పాటు గణేష్ ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ఈ నెల 10వ తేదీన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చవితి పూజా కార్యక్రమాలు నిర్వహించాలని టీడీపీ తీర్మానం చేసింది.

AP BJP leaders to meet Governor on Ganesh Festival celebrations
AP BJP leaders to meet Governor on Ganesh Festival celebrations

మరో పక్క బీజేపీ నేతలు ఈ అంశంపై నేడు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు కరోనా నిబంధనలకు లోబడి రాష్ట్రంలో అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వినాయక చవితి పండుగను మాత్రం జరుపుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల ద్వారా చేస్తున్న ప్రకటనలు హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే అవుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. వెంటనే ఈ విషయంపై గవర్నర్ స్పందించి పండుగకు సంప్రదాయ బద్దంగా పందిళ్లు వేసుకుని జరుపుకునేందుకు అనుమతులు మంజూరు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర బీజేపీ కోరనున్నది. బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఆ పార్టీ నేతలు వామరాజు సత్యమూర్తి, పాతూరి నాగభూషణంలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఈ రోజు 11.30 గంటలకు కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. గవర్నర్ దీనిపై జోక్యం చేసుకుంటారా, రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తారా ఉత్సవాలను జరుపుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇస్తుందా వేచి చూడాలి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N