ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Cabinet: కీలక నిర్ణయాలను ఆమోదించిన ఏపి కేబినెట్

Share

 

AP Cabinet: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ పునర్వవస్థీకరణ తర్వాత నేడు తొలిసారిగా జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర లభించింది. కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు అంబటి రాంబాబు, వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశంలో వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ను ముందుగానే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గతంలో కంటే ముందుగానే కృష్ణా, గోదావరి జలాలు విడుదల చేస్తామని చెప్పారు. గోదావరి డెల్టాకు జూన్ 1 నుండి ధవళేశ్వరం నుండి నీరు విడుదల చేస్తామని, రైతులు ముందస్తు వ్యవసాయ సీజన్ కు సమాయత్తం కావాలని సూచించారు.

AP Cabinet Decisions
AP Cabinet Decisions

AP Cabinet: ఇవి కేబినెట్ కీలక నిర్ణయాలు

 • మ‌డ‌క‌శిర‌లో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటునకు ఆమోదం
 • పెనుగొండ‌లో టూరిస్ట్ క్యాంప‌స్ కోసం భూమి కేటాయింపు
 • తిరుప‌తి జిల్లాలో ఇండ‌స్ట్రియ‌ల్ పార్క్ ఏర్పాటుకు ఆమోదం
 • నెల్లూరులో దివంగ‌త మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి పేరిట యూనివ‌ర్సిటీ
 • నెల్లూరు జిల్లా స‌ర్వేప‌ల్లిలో బ‌యోఇథ‌నాల్ ప్లాంట్ ఏర్పాటునకు ఆమోదం
 • వైయ‌స్ఆర్ క‌డ‌ప జిల్లాలో ఆస్ప‌త్రి నిర్మాణానికి భూమి కేటాయింపు
 • సంక్షేమ క్యాలెండ‌ర్‌కు అనుగుణంగా ప‌థ‌కాలు
 • పామ‌ర్రులో క‌మ్యూనిటీ హెల్త్ సెంట‌ర్ ఆధునీక‌ర‌ణ‌
 • పులివెందుల‌లో మ‌హిళా డిగ్రీ క‌ళాశాల‌లో నియామ‌కాల‌కు ఆమోదం
 • జూన్ 10 నుంచి కృష్ణా డెల్టాకు పులిచింత‌ల నీటి వినియోగం
 • కృష్ణా బ్యారేజీ వ‌ద్ద ఉన్న 3 టీఎంసీలు వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యం
 • జూన్ 30 నుంచి రాయ‌ల‌సీమ ప్రాజెక్టుల నీరు వినియోగం
 • రైతుల‌కు ముందుగానే స‌మాచార‌మివ్వాల‌ని సీఎం ఆదేశం
 • రాష్ట్ర వ్యాప్తంగా రైతుల‌కు సాగునీరు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం
 • సాగుకు స‌రిప‌డా నీటిని నిలువ చేయాల‌ని నిర్ణ‌యం
 • ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద డెడ్ స్టోరేజీని వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యం
 • గతేడాది కంటే ముందుగా వ్యవసాయ సీజన్‌ ప్రారంభించాలని నిర్ణయం
 • రేపు కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మత్స్యకార భరోసా పథకం
 • ఈ నెల 16న రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ
 • మే 31న సీఎం కిసాన్ యోజన కింద రూ.2వేలు జమ
 • జూన్ 6న కమ్యూనిటీ హైరింగ్ పథకం కింద వ్యవసాయ యంత్రాలు పంపిణీ
 • జూన్ 14న వైఎస్ఆర్ పంటల భీమా కింద రైతులకు నిధులు చెల్లింపు
 • జూన్ 19న యానిమల్ అంబులెన్స్ లు ప్రారంభం
 • జూన్ 21న అమ్మఒడి పథకం నిధులు తల్లుల ఖాతాల్లో జమ
 • నూతన ఎగుమతుల ప్రోత్సాహక విధానానికి కేబినెట్ ఆమోదం
 • 2022 – 27 కాలానికి నూతన ఎగుమతులు ప్రోత్సాహక విధానం
 • jరేపల్లెలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటునకు కేబినెట్ ఆమోదం


Share

Related posts

పుష్ప యూనిట్ ని వెంటాడుతున్న కరోనా ..మళ్ళీ అదే దెబ్బ కొట్టిందట ..?

GRK

బిగ్ బ్రేకింగ్: చంచల్ గూడ జైలుకు…అఖిల ప్రియ..!!

sekhar

బన్నీ ‘క్యారవాన్’ ఖరీదు ఎంతో తెలుసా?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar