ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ప్రతిపక్ష పార్టీలు, వారి అనుకూల మీడియాపై మరో సారి ధ్వజమెత్తిన సీఎం వైఎస్ జగన్

Share

AP CM YS Jagan: ఏపిలో ప్రతిపక్షాలు, వాటి అనుకూల మీడియా వ్యవహరిస్తున్న తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో సారి ధ్వజమెత్తారు. కరోనా సమయంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్యాంప్ కార్యాలయం నుండే వర్చువల్ విధానంలో ప్రారంభించిన వైఎస్ జగన్..కరోనా తగ్గుముఖం పట్టడంతో కొద్ది నెలలుగా జిల్లా పర్యటనలు చేస్తూ సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నారు. ఈ సందర్భాల్లో దుష్టచతుష్టయం అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీరి అనుకూల మీడియాపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో శుక్రవారం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్నని కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ప్రారంభించారు. ఈ సభలోనూ ప్రతిపక్షాల తీరుపై సీఎం జగన్ ధ్వజమెత్తారు.ప్రజలకు తాను ఏమి చేస్తాను అని చెప్పే ధైర్యం ఆ దత్తపుత్రుడికి లేదంటూ పరోక్షంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి విమర్శించారు.

AP CM YS Jagan slams chandrababu and others
AP CM YS Jagan slams chandrababu and others

AP CM YS Jagan: కడుపు మంట, ఈర్ష్యతో ప్రభుత్వంపై దుష్ప్రచారం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 95 శాతం పూర్తి చేశామనీ, ఇంటింటికి వెళ్లే నైతికత కేవలం తమకు మాత్రమే ఉందని సీఎం జగన్ అన్నారు. తమ ప్రభుత్వం పేదలకు మంచి చేస్తుంటే దుష్టచతుష్టయంతో పాటు దత్తపుత్రుడుకి కడుపు మంట, ఈర్ష్య పుట్టుకొస్తున్నాయనీ, అందుకే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. పరీక్షా పేపర్లు లీక్ చేసి ప్రభుత్వంపై విమర్శలు చేసేది వాళ్లే, లీక్ చేసిన వాళ్లను పట్టుకుంటే వాళ్లను సమర్ధిస్తూ ప్రభుత్వ కక్షసాధింపు అంటూ యాగీ చేసేది వాళ్లేనని అన్నారు. లీక్ చేసే వాళ్లను సమర్ధించే ప్రతిపక్షాన్ని ఎక్కడైనా చూశారా అని జగన్ ప్రశ్నించారు. కార్మిక మంత్రిగా ఉంటూ ఉద్యోగులకు మంచి చేయాల్సింది పోయి కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడితే వారిని విచారించడానికి వీల్లేదు అంటారు ఇటువంటి వాళ్లను ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు. ప్రజలను కాకుండా మంత్రిగా పని చేసి మంగళగిరిలో ఓడిపోయిన సొంత పుత్రుడు, రెండు చోట్ల పోటీ చేసి గెలవని దత్తపుత్రుడి నమ్ముకుని రాజకీయం చేస్తున్న చంద్రబాబు లాంటి రాజకీయ నేతను ఎక్కడైనా చూశారా అని ప్రశ్నించారు.

‘అమరావతిలో పేదలకు స్థలాలు ఇస్తే సమతుల్యత దెబ్బతింటుందట’

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే సముతుల్యత దెబ్బతింటుంది అంటూ కోర్టులో పిటిషన్ వేసి అడ్డుకున్నారంటూ సీఎం జగన్ మండిపడ్డారు. రాబందుల్లాంటి వీళ్లకు ప్రజలకు ఎలాంటి మంచి జరిగినా నచ్చదని అన్నారు. పేదలకు మంచి చేయడం కోసం నిధుల కోసం ప్రయత్నిస్తుంటే రాష్ట్రానికి వచ్చే నిధులను కూడా అడ్డుకుంటున్నారని జగన్ విమర్శించారు. బ్యాంకుల నుండి రావాల్సిన అప్పులకు కోర్టులో పిటిషన్లు వేసి అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. 27 సంవత్సరాలుగా కుప్పంలో ఇల్లు కట్టుకోవాలని ఆలోచన చేయని చంద్రబాబు ఈ రోజు జగన్ పాలనను మూడేళ్లు చూశాడో లేదో కుప్పంలో ఇల్లు కట్టుకుంటున్నారని అన్నారు. వక్రబుద్ది ఉన్న దుష్టశక్తుల నుండి రాష్ట్రాన్ని కాపాడాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు సీఎం జగన్.


Share

Related posts

Prabhas: ఆ డైరెక్టర్ తో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్న ప్రభాస్..??

sekhar

Bigg Boss 5 Telugu: జెస్సీకి గ్రాండ్ వెల్ కమ్ పలికిన ఆ కంటెస్టెంట్ లు..!!

sekhar

Pawan kalyan: ‘భీమ్లా నాయక్’ మూవీ కోసం ఆ రెండూ కాదు మరో కొత్త రిలీజ్ డేట్..?

GRK