NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

AP high court : కోర్టు మెట్లేక్కడం ఆనందం కాదు… అవమానం!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లోని అధికారులకు సైతం హై కోర్టు  AP high court మెట్లు ఎక్కడం ఆనవాయితీగా మారుతోంది. నెలకు రెండు మూడు సార్లైనా హైకోర్టుకు వెళ్ళడం అక్కడ కోర్టు చివాట్లు తినడం అధికార గణానికి అలవాటుగా మారుతుంది. చిన్నచిన్న కేసులకు సైతం పెద్దవి చేసుకుంటూ… అధికారులు న్యాయ వ్యవస్థ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే మాటను మూటగట్టుకుఅంటున్నారు. పరిపాలనాపరమైన అంశాలను పరిష్కరించడంలో ఎక్కడో లోపం మరెక్కడో నిర్లక్ష్యం స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ అధికారుల్లో కనిపిస్తోంది. వరుసగా రెండు రోజుల పాటు హైకోర్టు ఓ ఎస్ ఐ కు పదోన్నతి విషయంలోనూ, ఓ అటెండరుకు పదోన్నతి కల్పించడంలోనూ అధికారులు ప్రవర్తించిన నిర్లక్ష్యాన్ని వారు తీసుకున్న చర్యలను కోర్టు తీవ్రంగా ఖండించడమే తో పాటు మందలించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

కోర్టు ఆదేశాలు పట్టవా?? AP high court 

ఓ వ్యక్తి లేదా ఓ సంస్థ తమ హక్కులకు భంగం వాటిల్లినప్పుడు న్యాయం జరగడం లేదని భావించినప్పుడు కోర్టులను ఆశ్రయించడం రివాజు. దానిని కోర్టు పరిశీలించి సంబంధిత అధికారులందరికీ నోటీసులు జారీ చేస్తుంది. వచ్చి దాని తాలూకు అంశాలను వివరించాలని సూచిస్తుంది. రాజ్యాంగంలో అత్యున్నత వ్యవస్థ గా పేర్కొన్న న్యాయ వ్యవస్థ ఆదేశాలను అంతా తప్పక పాటించాలి. అయితే రాష్ట్ర అధికారులు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం వారు రకరకాల దారుల్లో కోర్టుకు డుమ్మా కొడుతున్నారు. ఒక్కోసారి వారు చెప్పే కారణాలు సైతం కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి సైతం చాలా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. మొన్నటికి మొన్న ఓ ఎస్సై పదోన్నతి వివాదంలో డిజిపి కోర్టుకు రాలేనని సమర్పించిన అఫిడవిట్ ను తప్పుబట్టిన కోర్టు నిన్న ఓ అటెండర్ విషయంలో అధికారులు చూపించిన అలసత్వాన్ని ఎండగట్టింది. అంతే కాదు అధికారుల కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విషయంలో అంత సీరియస్ వరకు తెచ్చుకోవాల్సిన ఆగత్యం ఏముంది అన్నది అధికారులు గుర్తించాలి. ప్రతిసారి హైకోర్టు చీవాట్లు తినడం హైకోర్టు నుంచి మొట్టికాయలు తినడం అలవాటుగా మారిన అధికారులు… భవిష్యత్తు తరాల అధికార గణానికి ఏం సందేశం చెబుతారు అన్నది న్యాయనిపుణుల ప్రశ్న.

 AP high court  Going to court is not a pleasure ... shame !!
AP high court Going to court is not a pleasure shame

ప్రభుత్వ తీరు అలాగే! AP high court 

న్యాయవ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాగిస్తున్న అంశాలను, తీరును అధికారగణం సైతం ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టుకు ప్రభుత్వానికి నడుమ ఎన్నో బేధాభిప్రాయాలు పలు కేసుల్లో విభిన్నమైన తీర్పు దృష్ట్యా… కోర్టులను తులనాడుతూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు సైతం రచ్చాకేక్కరు. ప్రస్తుతం ఏపీలోని చాలామందిలో కోర్టులు… ప్రభుత్వం తీసుకునే చర్యలు అన్నిటిని వ్యతిరేకిస్తుంది అనే భావన కలిగించేలా ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు ఇప్పుడు అధికారులకు అలవాటు అయినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం దారిలోనే అధికారగణం కూడా ప్రయత్నిస్తున్నట్లు అర్ధం అవుతోంది. జిల్లాస్థాయి కోర్టులే ఆదేశిస్తే రాష్ట్ర స్థాయి అధికారులు హాజరై సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను సైతం అధికారులు అసలు వెళ్ళని పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో నెలకొనడం విచిత్రంగా ఉందని న్యాయ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదని హైకోర్టు ఆదేశం రాగానే నోటీసు అందగానే అధికారులు వేగంగా స్పందించే వారు దానికి తగినట్లుగా… సంసిద్ధులై కోర్టుకు వచ్చేవారని ప్రస్తుతం ఆ పరిస్థితి అధికారులు కనిపించడం లేదన్నది హైకోర్టు లాయర్లు చెబుతున్న మాట. అంటే క్రమంగా అధికార గణానికి ప్రభుత్వానికి న్యాయవ్యవస్థ మీద నమ్మకం పోతుందా లేక న్యాయవ్యవస్థను కావాలనే చిన్నచూపు చూసే చర్యలకు పూనుకున్నా రా అన్నది వారికే తెలియాలి. అయితే ఒకటి మాత్రం నిజం న్యాయవ్యవస్థను తక్కువ చేసి చూస్తే రాజ్యాంగాన్ని తక్కువ చేసి చూసినట్లే… అది భవిష్యత్తు తరాలకు తప్పుడు సంకేతాలను ఇస్తోంది అనడంలో సందేహం లేదు.

author avatar
Comrade CHE

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N