Shakeela : సౌత్ ఇండియాలో శృంగార తారగా ఒకానొక సమయంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది షకీలా. Shakeela మలయాళం పరిశ్రమకు చెందిన ఈ ముద్దుగుమ్మ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా పక్కకు తప్పుకునే మార్కెట్ అప్పట్లో ఉండేది. షకీలా సినిమా రిలీజవుతుందంటే చాలు కాలేజీలకు ఎగ్గొట్టి కుర్రాళ్ళు సైకిల్ మీద సినిమా ధియేటర్ల గేటు వద్ద పడిగాపులు కాసే వాళ్ళు. అటువంటి షకీలా జీవితానికి సంబంధించి నేరుగా ఆమె పేరుతో సినిమా తెరకెక్కించడం తాజాగా జరిగింది.
ఆమె అనుమతి తీసుకున్న గానీ కథ విషయంలో మాత్రం కొన్ని సన్నివేశాలు తన జీవితంలో జరగనివ్వమని తాజాగా ఈ సినిమా గురించి షకీలా ఓ ఇంటర్వ్యూలో ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా సిల్క్ స్మిత జీవితానికి సంబంధించిన డర్టీ పిక్చర్ తో పాటు ప్రస్తుతం వస్తున్న తన సినిమా షకీలా లో కూడా పెద్ద తప్పులు ఉన్నాయని.. డబ్బులు సంపాదించుకోవడమే టార్గెట్ గా పెట్టుకుని సినిమాలు తీసినట్లు షకీలా వ్యాఖ్యానించింది. రెండు సినిమాల్లో తనకు పోటీగా సిల్క్ స్మిత ని చూపించడం జరిగింది అందులో వాస్తవం లేదని వ్యాఖ్యానించింది. ఇదిలా ఉంటే ఒక సినిమా షూటింగ్ సందర్భంలో ఆ కారణంగా సిల్క్ స్మిత తన ని చంప దెబ్బ కొట్టిన దాని తర్వాత క్షమాపణ చెప్పిందని తెలిపింది. క్రేజ్ పరంగా చూసుకుంటే తానెక్కడ ఉండేదని, ఆమె చనిపోయిన తర్వాత కొన్నాళ్లకు తనకి మార్కెట్ క్రియేట్ అయిందని, నిజానికి సిల్క్ స్మిత ముందు తనది చాలా చిన్న స్థాయి అని షకీలా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి కుటుంబ బంధాల గురించి షకీలా మాట్లాడుతూ అప్పట్లో డబ్బు మొత్తం బంధువుల కోసమే ఖర్చు చేసినట్లు తెలిపింది. నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేక పోవడంతో బంధువులంతా వదిలేశారని, పెద్ద బ్యాంకు బ్యాలెన్స్ అనేది కూడా తన దగ్గర లేదని బతకడానికి కావలసిన డబ్బులు మాత్రమే ఉన్నట్లు ఈ క్రమంలో సినిమాలు కూడా ఒప్పుకున్నట్లు షకీలా చెప్పుకొచ్చింది. ఒంటరిగా ఎప్పుడైనా అనిపిస్తే మాత్రం వెంటనే అమ్మ అక్క దగ్గరికి వెళ్లి కొంతసేపు సమయం గడుపుతాను అని తెలిపింది.