ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

JP Nadda: ఏపికి చేరుకున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా..పొత్తులపై క్లారిటీ ఇచ్చేస్తారా..?

Share

JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా గన్నవరం విమానాశ్రయానికి కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జేపి నడ్డా ప్రత్యేక విమానంలో ఏపికి చేరుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయం నుండి జేపి నడ్డా విజయవాడ సిద్ధార్ణ హోటల్ మేనేజ్ మెంట్ కాలేజీకి ప్రాంగణానికి రోడ్డు మార్గాన చేరుకున్నారు. తొలుత గన్నవరం విమానాశ్రయం వద్ద బీజేపీ నాయకులను లోపలకు అనుమతించకపోవడంతో సోము వీర్రాజు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో గొద్ది సేపు వాగ్వివాదం అయ్యింది. జాబితాలో లేని వారిని లోపలకు పంపడం సాధ్యం కాదని ఎయిర్ పోర్టు అధికారులు తేల్చి చెప్పడంతో విమానాశ్రయం వద్ద బీజేవైఎం కార్యకర్తలు కొద్దిసేపు ధర్నా చేశారు.

BJP Chief JP Nadda AP Tour
BJP Chief JP Nadda AP Tour

Read More:TDP Janasena: పవన్ కేంద్ర మంత్రిగా..బాబు సీఎంగా..! కీలక ఒప్పందం దిశగా..!?

JP Nadda: శక్తి కేంద్రాల ఇంచార్జి లకు దిశ నిర్దేశం

జేపి నడ్డా విజయవాడలో శక్తి కేంద్రాల ఇన్ చార్జిల సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం విజయవాడ నగర ప్రముఖులతో సమావేశం అవుతారు. అనంతరం రాష్ట్ర కోర్ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో భేటీ అవుతారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో నేడు జేపి నడ్డా చర్చించనున్నారు. రేపు రాజమండ్రిలో జరిగే బహిరంగ సభలో జేపి నడ్డా ప్రసంగించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొత్తుల అంశం హాట్ టాపిక్ గా నడుస్తొంది. జనసేన – బీజేపీ ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్ ను ప్రకటించాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నేడు జరిగే సమావేశాల్లో జేపి నడ్డా దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలని పలువురు జనసేన నేతలు కోరుతున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు జేపి నడ్డా ఎటువంటి దిశానిర్దేశం చేస్తారు అనేది అసక్తికరంగా మారింది.


Share

Related posts

Dear Megha: “బాగుంది ఈ కాలమే” మెలోడియస్ సాంగ్ ను ఆలపించిన సిద్ద్ శ్రీరామ్..

bharani jella

Pawan kalyan : పవన్ కళ్యాణ్ – రానా ఏకే రీమేక్ టైటిల్ ‘భీమ్లా నాయక్’

GRK

Bigg boss Rohini : ఇంట్లో ఎవరూ లేకపోతే రోహిణి ఏం చేస్తుందో తెలుసా?

Varun G