NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP – Janasena : గాజు గ్లాసు ఎన్నికల గుర్తు జగన్ బినామీదా…? అదెట్లాగా..!?

BJP – Janasena : తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో నవతరం పార్టీ అభ్యర్థి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ ను కేటాయించిన సంగతి తెలిసిందే. ఇదీ బీజేపీ – జనసేన శ్రేణుల్లో ప్రకంపనాన్ని సృష్టిస్తోంది. ఓ పక్క జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆ పార్టీ అధికారిక గుర్తు అయిన గాజు గ్లాసును నవతరం పార్టీ అభ్యర్థికి కేటాయించడం తీవ్ర దుమారాన్నే రేపుతుంది. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ఆ కారణంగానే బీజేపీ నానా తంటాలు పడి, సీఎం పదవీ కూడా ఏరగా చూపి పవన్ ను ప్రసన్నం చేసుకున్నారు.

BJP - Janasena vishnu vardhan reddy comments
BJP Janasena vishnu vardhan reddy comments

ఇప్పుడు ఈ విధంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే…ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయా రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థిని ప్రకటించని బీజేపీ….ఏపిలో ఓ పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంలో సీఎం అభ్యర్థి పవన్ కల్యాణ్ అంటూ ప్రకటించి ప్రొజెక్టు చేస్తున్నారు అంటే పవన్ అభిమానులు, ఆ నేత సామాజిక వర్గ ఓట్లు గుంప గుత్తగా బీజేపీ వేయించుకోవాలన్న రాజకీయ ఎత్తుగడేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటువంటి తరుణంలో పవన్ కల్యాణ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని పవన్ అభిమానుల్లో చెరగని ముద్రవేసుకున్న ఆ ఎన్నికల గుర్తుపై నవతరం పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుండటంతో బీజేపీ ఆశలపై నీళ్లు చల్లినట్లు అవుతోంది. దీంతో ఖంగుతున్న బీజేపీ దీని వెనుక వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఉన్నారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

తిరుపతిలో బీజేపీ – జనసేన ప్రభంజనానికి భయపడి వారు అనుచరులతో జనసేన ఎన్నికల గుర్తును కుట్రతో తీసుకున్నారని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్థన్ రెడ్డి విమర్శించారు. ఇదే సందర్భంలో బీజేపీ -జనసేన అభ్యర్థిని ఎదుర్కునేందుకు అధికార వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలను దింపి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై నేరుగా సమాధానం చెప్పే ధైర్యం లేక తమ పార్టీ నేతలపై మంత్రులు అవాకులు, చెవాకులు పేలుతున్నారని విమర్శించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?