Breaking: సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు

Share

Breaking: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ సర్కార్ మరో సారి షాక్ ఇచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావుపై మరో సారి సస్పెన్షన్ వేటు వేసింది ఏపి సర్కార్. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనపై గతంలో విధించిన సస్పెన్షన్ తొలగించిన ఏపి ప్రభుత్వం ఇటీవలే పోస్టింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా నియమించగా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే సర్వీసు నిబంధనలకు విరుద్దంగా క్రమశిక్షణారహిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.

Breaking IPS AB Venkateswara Rao suspended once again

 

ఏబి వెంకటేశ్వరరావు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత హోంశాఖలో పరికరాల కొనుగోలులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై సస్పెండ్ చేశారు. తన సస్పెన్షన్ పై అప్పట్లో ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాత ఏబీ వెంకటేశ్వరరావు ఏపి హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆయనను విధుల్లోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఆరు నెలల చొప్పున రెండేళ్లకు పైగా ఆయన సస్పెన్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తూ వచ్చింది. అయితే రెండేళ్లకు పైగా సివిల్ సర్వీస్ అధికారిని సస్పెన్షన్ లో కొనసాగించకూడదన్న నిబంధన మేరకు ఆయనను విధుల్లోకి తీసుకోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

 

సుప్రీం కోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని కోరుతూ ఏబీ వెంకటేశ్వరరావు పలు మార్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారు. సీఎస్ ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలోనూ ఏబీ వెంకటేశ్వరరావుకు అపాయింట్మెంట్ లభించలేదు. ఈ విషయాన్ని ఏబీ వెంకటేశ్వరరావు అప్పట్లోనే మీడియాకు వెల్లడించారు. మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏబీ వెంకటేశ్వరరావు. ఆ తరువాత సస్పెన్షన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే పోస్టింగ్ కొరకు కూడా ఏబీ వెంకటేశ్వరరావు ప్రభుత్వానికి లేఖలు రాశారు. అదే క్రమంలో తన సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లోనూ తప్పులు ఉన్నాయనీ, ఈ ఏడాది మార్చి నెల నుండే సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారనీ, దాన్ని సరి చేయాలని కోరారు. కాగా కోర్టు ఆదేశాల నేపథ్యంలో గత నెలలో సస్పెన్షన్ ఎత్తివేస్తూ జీఏడి లో రిపోర్టు చేయమని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం.. రెండు వారాల క్రితం పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రింటింగ్ స్టేషనరీ స్టోర్స్ సర్వీస్ డిపార్ట్ మెంట్ కు కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏబీ వెంకటేశ్వరరవుపై మరో సారి సస్పెన్షన్ వేటు పడింది.

 


Share

Recent Posts

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

36 నిమిషాలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

40 నిమిషాలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

56 నిమిషాలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

1 గంట ago

నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పిని తగ్గించే డ్రింక్స్..!

ప్రతి స్త్రీ యొక్క జీవితంలో పీరియడ్స్ రావడం అనేది సాధారణ ప్రక్రియ. అలాగే స్త్రీ యోక్క ఆరోగ్యం విషయంలో కూడా పీరియడ్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతి…

2 గంటలు ago

“SSMB 28” ఆలస్యం కావడానికి కారణం అదేనట..??

"SSMB 28" వర్కింగ్ టైటిల్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు ఈ ఏడాది…

2 గంటలు ago