NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

KCR : కేసీఆర్ ను కాపీ కొట్టేస్తున్న జ‌గ‌న్‌… సంచ‌ల‌న‌మే!

KCR : తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు , ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోలిక‌. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఈ ఇద్ద‌రు సీఎంల మ‌ధ్య స‌ఖ్య‌త ఉన్న సంగ‌తి తెలిసిందే.  దీనికి తోడుగా ప‌లు నిర్ణ‌యాలు సేమ్ టు సేమ్ ఉంటున్నాయి.

తాజాగా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను కాపీ కొట్టేశార‌ని అంటున్నారు. అందులో ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌ట‌మే నిర్ణ‌యం కావ‌డం స‌హ‌జంగానే హాట్ టాపిక్ గా మారింది.

KCR
KCR

KCR  కేసీఆర్ ఏం చేశారంటే…

తెలంగాణ శాసన మండలిలో ఖాళీ అవుతున్న రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌ శ్రేణులు గ్రాడ్యుయేట్లను ఓటర్లుగా చేర్పించారు. అయితే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి ఆచితూచి అడుగులు వేస్తోన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థుల విషయానికి వస్తే.. ఒక స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్సీకే ఛాన్స్ ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది.

ఆ మేరకు నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు కూడా. కానీ మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్‌ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో టీఆర్‌ఎస్‌లో అలికిడి లేదు. వివిధ వ‌ర్గాల్లో జ‌రుగుతున్న ప్రచారం ప్ర‌కారం పోటీకి దూరంగా ఉండాల‌ని డిసైడ్ అయింద‌ట టీఆర్ఎస్‌.

జ‌గ‌న్ సైతం సేమ్‌….

ఏపీలో రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలవ్వగా.. నామినేషన్ పక్రియ ప్రారంభం అయ్యింది. ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి మార్చి 14 ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ రెండు స్థానాలకు ఉపాధ్యాయ సంఘాల నుండి గట్టి పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానాలకు పోటీపై అధికార పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయకూడదని సీఎం జగన్ నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం సాగుతోంది. నాన్ పొలిటికల్‌గా జరిగే ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కలుగచేసుకోవడం సరికాదని భావించిన సీఎం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం నాలుగు జిల్లాల మంత్రులు, ముఖ్య నేతలను పిలిచి.. వారికి ఇదే విషయాన్ని చెప్పినట్లు సమాచారం. మొత్తంగా ఇద్ద‌రు సీఎంలు కీల‌క‌మైన మండ‌లి ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌టం చ‌ర్చ‌నీయాంశమే!

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju