ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

KODALI Nani: టీడీపీకి విలన్.. ఎవరికి రౌడీ!?

kodali nani slams tdp
Share

KODALI Nani: ఏపీ రాజకీయాల్లో నాయకులు అందరూ నాణేనికి ఒకవైపు అయితే.. కొడాలి నాని ఒక వైపు. ప్రస్తుతం ఆయనో ఫైర్ బ్రాండ్.. అంతకుమించి ఫెరోషియస్ లీడర్. ప్రభుత్వ వాణిని వినిపించడంలో, ప్రతిపక్ష నేత చంద్రబాబును విమర్శించడంలో ఆయనో స్పెషల్ ఐకాన్. వైసీపీ తరపున ఆయన ఓ వెపన్. ప్రతిపక్షాలకు మాత్రం ఆయన బూతుల మంత్రి. చంద్రబాబును తిట్టిపోయడంలో ఆయన పలికే మాటలు ఆ స్థాయిలో ఉంటాయి మరి. ఈ రెండున్నరేళ్లలో చంద్రబాబును అవకాశం వచ్చినప్పుడల్లా తన మాటలతో చీల్చి చెండాడుతూనే ఉన్నారు. కానీ.. టీడీపీ నుంచి మాత్రం అతి తక్కువగానే రిప్లై వస్తూంటుంది. అయినా.. కొడాలి నాని పని అయిపోయింది.. ఆ బూతులు వింటున్న గుడివాడ ప్రజలు ఆయన్ను మళ్లీ గెలిపించే అవకాశం లేదు అని ప్రచారం చేస్తూంటారు.

kodali nani slams tdp
kodali nani slams tdp

నాని క్రేజ్..

అయితే.. ఇక్కడ గమనించాల్సింది నానీ క్రేజ్. పార్టీ గుర్తుపై గెలిచేవారు కొందరు, నాయకుడి చరిష్మాతో గెలిచేవారు మరికొందరు ఉంటే.. సొంత చరిష్మాతో గెలిచేవారు తక్కువగా ఉంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తి కొడాలి నాని. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, సమస్యలు పరిష్కరిస్తున్నారు కాబట్టే. నాలుగుసార్లు ప్రజలు ఆయన్ను గెలిపించారు. 2004లో వైఎస్ హవాలో కూడా టీడీపీ నుంచి గెలిచారు. 2009లో కూడా ఇదే పరిస్థితి. 2012లో టీడీపీ నుంచి బయటకొచ్చి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా (KODALI Nani) నాని వైసీపీ నుంచి అద్భుత విజయం సాధించారు. 2019లో ప్రజలు ఆయననే గెలిపించడంతో వైఎస్ జగన్ క్యాబినెట్ లో మంత్రిగా కొనసాగుతున్నారు.

ఆ విజయాలే నిదర్శనం..

ప్రస్తుత క్యాబినెట్ ఆయనొక్కరే కమ్మ సామాజికవర్గం నుంచి మంత్రి. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన చంద్రబాబును తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. దీంతో కమ్మవారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న గుడివాడలో ఇక (KODALI Nani) నానికి ఓట్లు పడవు అని టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే.. గుడివాడ ప్రజలు ఆయన చరిష్మాకు ఓటేస్తున్నారు కానీ.. ఆయన ఏ పార్టీలో ఉన్నారు.. కులం ప్రాతిపదికన కాదనేది గత నాలుగు ఎన్నికల్లో ఆయన విజయాలే నిరూపిస్తున్నాయి. ‘వాడెక్కడున్నా ఎక్కడున్నా రాజే..రా’ అని బాహుబలిలో డైలాగ్ ఉంది. ఇది కొడాలి నానికి సరిగ్గా సరిపోతుంది. ఆయన అసెంబ్లీ రౌడీ కాదు.. అసెంబ్లీ టైగర్..!


Share

Related posts

బొత్స వ్యాఖ్యలతోనే రాజధాని పేరు గల్లంతు

somaraju sharma

రాష్ట్రానికి చేరుకున్న మాయావతి

sarath

Crime News: ఒంగోలులో దారుణం..! యువతిని ఎస్ఐ పేరు చెప్పి తీసుకువెళ్లి..!?

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar