Avanigadda (Krishna): కృష్ణాజిల్లా ఆవనిగడ్డ మండలం పెదమూడి గ్రామంలో మహిళా పాల ఉత్పత్తిదారుల సంఘం సభ్యులకు బోనస్ చెక్కులను పంపిణీ చేసింది. కృష్ణామిల్క్ యూనియన్ వారు అందించిన బోనస్ చెక్కులను శనివారం సభ్యులకు పంపిణీ చేశారు. మూడు నెలల కాలానికి గానూ 164,64.4 లీటర్లకు గానూ రూపాయికి 15పైసలు చొప్పున మొత్తం రూ.1,11,353.10ల పంపిణీ చేశామని కార్యదర్శి కేవిఎస్ఆర్ ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా మిల్క్ యూనియన్ లక్షా 50 వేల కుటుంబాలకు సంస్థ అనేక పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

క్షీర బంధు, కళ్యాణ మస్తు, ప్రతిభ, ప్రమాద భీమా, హెల్త్ కార్డులు వంటి అనేక పథకాలను పాల ఉత్పత్తిదారులకు అందజేస్తుందన్నారు. పాడి రైతు ఏ కారణం చేత మరణించినా వారి కుటుంబానికి రూ.50వేలు అసరా, పాడి రైతు కుటుంబంలో వివాహ శుభ కార్యక్రమాలకు మంగళసూత్రం నిమిత్తం రూ.20వేలు విలువ గల బంగారు నాణెం బహుకరణ అందించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో టెస్టర్, సామాజిక సమన్వయకర్త, బెస్ట్ విద్యా వాలంటీర్ బచ్చు ఆదినారాయణరావు, మహిళా పాల ఉత్పత్తి దారుల సంఘం అధ్యక్షులు, కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.