NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్ .. ఆ నాలుగు పార్టీలకు వ్యతిరేకమే..

AP Politics: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ స్పష్టత ఇచ్చారు. ఇవేళ ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..మతతత్వ బీజేపీతో తమది రాజీలేని పోరాటం అని చెప్పారు. అదే మాదిరిగా టీడీపీ – జనసేన కు వ్యతిరేకంగా పోరాడుతున్నామన్నారు. బీజేపీతో వైసీపీ రహస్య బంధం కొనసాగిస్తొందని పేర్కొన్నారు. కావున ఏపీలో ఈ నాలుగు పార్టీలకు వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్టీలతో కలిసి పోరాడుతామని మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ – జనసేన కూటమిగా ఏర్పడి ముందుగా సాగుతుండగా, తమ పొత్తు జనసేనతోనే అని బీజేపీ అంటోంది. అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీతో అనధికార మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటంతో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలా లేదా అన్నదానిపై టీడీపీ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో ఒక్క శాతం కూడా ఓటింగ్ లేని బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీ ఓటింగ్ దూరమవుతుందన్న భావన టీడీపీ నేతల్లో ఉంది. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో వ్యవస్థల తోడ్పాటు కోసం బీజేపీతో స్నేహహస్తం కోసం టీడీపీ ఆశపడుతోందని అంటున్నారు.

బీజేపీతో టీడీపీ – జనసేన కూటమి కలవకపోతే వామపక్షాలు ఈ కూటమితో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నాయి. అయితే ఇంత వరకూ పొత్తుల అంశంపై బీజేపీ – టీడీపీ మధ్య ఇంత వరకూ చర్చలే మొదలు కాలేదు. ఓ పక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తూ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జిలను ప్రకటిస్తొంది. ఇందులో ఓ అడుగు ముందులో ఉంది వైసీపీ. టీడీపీ – జనసేన కూటమికి బీజేపీతో పొత్తు అంశం తేలకపోవడంతో అసెంబ్లీ ఇన్ చార్జిల ఎంపికలో ఈ పార్టీలు వెనుకబడ్డాయి.

వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందనీ, టీడీపీ, కాంగ్రెస్ ఒకటేనని వీళ్లంతా కలిసి వచ్చినా వైసీపీకి వచ్చే నష్టం ఏమిలేదని ఆ పార్టీ నేత సజ్జల కామెంట్స్ చేశారు. ఈ తరుణంలో ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాగూర్ స్పష్టత ఇచ్చారు. ఇక బీజేపీ తీసుకునే స్టాండ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీతో పొత్తు అంశంపై ఏపీ బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ నేతల అభిప్రాయాలను హైకమాండ్ తీసుకుంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

YS Sharmila: వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై సంచలన వ్యాఖ్యలు చేసిన సజ్జల

Related posts

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju