NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Parliament Monsoon Session 2021: గేరు మార్చిన వైసీపీ..! కేంద్రంపై ఇక యుద్ధమేనా..!?

Parliament Monsoon Session 2021: కేంద్రంలోని బీజేపీపై వైసీపీ వైఖరి మారినట్లు కనబడుతోంది. నేటి నుండి జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో తమ వాణిని గట్టిగా వినిపించాలన్న కృత నిశ్చయంతో వైసీపీ ఉన్నట్లు స్పష్టం అవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన సమస్యల పట్ల కేంద్రంలోని బీజేపీ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని ఆ పార్టీ ఎంపిలు స్పష్టం చేస్తున్నారు. నిన్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కేంద్రంపై ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు.

Parliament Monsoon Session 2021 ysrcp fight on pending issues
Parliament Monsoon Session 2021 ysrcp fight on pending issues

Read More: Vijaya Sai Reddy: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వైసీపీ ఎంపి విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు..!!

గత రెండు సంవత్సరాలుగా కేంద్రంలోని బీజేపీ పట్ల వైసీపీ సానుకూల ధోరణితోనే వ్యవహరించింది. పలు కీలక బిల్లుల ఆమోదం విషయంలో రాజ్యసభలో వైసీపీ సహకరిస్తూనే వచ్చింది. కేంద్రంతో సఖ్యతగా ఉన్నప్పటికీ పోలవరం నిధులు మంజూరు చేయడంలో. విభజన చట్టం హామీలను నెరవేర్చే విషయం తదితర అంశాలలో కేంద్రం పక్షపాత వైఖరి అవలంబిస్తుందనేది వైసీపీ వాదన. అదే విధంగా పార్టీ దిక్కారానికి పాల్పడుతున్న నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు అనర్హత పిటిషన్ పైనా స్పీకర్ 11 నెలలుగా చర్యలు తీసుకోకపోవడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. రెండు రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో  ఉభయ సభల్లో సభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు.

అయితే ఈ సారి సమావేశంలో ఎలాగైనా రఘురామపై అనర్హత వేటు వేసేలా పార్లమెంట్ సాక్షిగా ఆందోళన చేయాలని వైసీపీ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇటీవల విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలలోపు అనర్హత పిటిషన్ పై స్పీకర్ చర్యలు తీసుకోకుంటే పార్లమెంట్ లో ఆందోళన చేస్తామని కూడా హెచ్చరించి ఉన్నారు. ఆ హెచ్చరికల తరువాతనే స్పీకర్ ఓం బిర్లా రఘురామతో పాటు మరో ఇద్దరు టీఎంసీ ఎంపిలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం విరమించుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తున్నది. ఉభయ సభల్లో ఈ సారి గతం కంటే భిన్నంగా వైసీపీ సభ్యులు గట్టిగానే వాదనలు వినిపించే అవకాశాలు ఉన్నాయి.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N