NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసుల నోటీసులు .. పోలీస్ ఆంక్షల మధ్య రుషికొండ పరిశీలన

Advertisements
Share

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విశాఖలో కొనసాగుతోంది. జగదాంబ జంక్షన్ లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన పవన్ కళ్యాణ్ ఇవేళ రుషికొండను పరిశీలించారు. అయితే రుషికొండ పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. పవన్ కారుతో పాటు మరో ఏడు కార్లను పోలీసులు అనుమతి ఇచ్చారు. నోవాటెల్ నుండి రుషికొండ కు పది కిలో మీటర్ల దూరం ఉండగా, జనసేన కార్యకర్తలు, అభిమానులతో కలిసి ర్యాలీగా రుషికొండకు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. పవన్ పర్యటిస్తున్న మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు పోలీసులు, జోడుగుళ్లపాలెం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Advertisements

 

రుషికొండ వద్దకు వాహనాలను అనుమతి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ కాలినడకన వెళ్లి అక్కడ వాహనం ఎక్కి నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్రను దోపీడీ చేస్తున్నారని విమర్శించారు. రుషికొండ నిర్మాణాలకు అన్ని అనుమతులు వచ్చాయా అని ప్రశ్నించారు.  తుఫాన్లు వచ్చినప్పుడు రుషికొండ కాపాడుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర భూములు, ఆస్తులపై వైసీపీ నేతల కళ్లు పడ్డాయని ఆరోపించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అడ్డగోలుగా దోచుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణను కూడా ఇలాగే దోచేశారని అన్నారు. జగన్ కు ఎన్ని ఇళ్లు కావాలని ప్రశ్నించారు. వైసీపీ నేతల దోపిడీ రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలన్నారు.

Advertisements

 

కాగా, రుషికొండ పర్యటనకు ముందు పవన్ కళ్యాణ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న జరిగిన సభలో పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ విశాఖ పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసుల్లో మూడు సూచనలు, మరో మూడు ఆదేశాలు ఉన్నట్లు తెలుస్తొంది. వాటిని అనుసరించాలని పోలీసులు నోటీసులో ప్రస్తావించారు. వారాహి యాత్రలో భాగంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దనీ, నిరాధార ఆరోపణలు చేయవద్దని, వర్గ విభేదాలు సృష్టించే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. అలాగే జనసేన తరపున ఏర్పాటు చేసే కార్యక్రమ షెడ్యుల్ ముందుగానే తెలియజేయాలని, శాంతి భద్రతల విఘాతం కల్గించబోమని హామీ ఇవ్వాలని, పోలీసు నిబంధనలు పాటించాలని విశాఖ పోలీసులు పేర్కొన్నారు.

 

మరో పక్క పవన్ రుషికొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించడాన్ని జనసేన తప్పుబట్టింది. రుషికొండ నిషిద్ద ప్రాంతమా అని ప్రశ్నించింది. రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెళుతున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు రుషికొండ కు వెళ్లే మార్గాలను దిగ్బందనం చేశారని జనసేన పేర్కొంది. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్లనివ్వలేదనీ, రుషికొండ పర్యటాక ప్రాంతమైనప్పటికీ నిషిద్ద ప్రాంతంగా మార్చేశారని విమర్శించింది. రుషికొండ కు వెళ్లే అన్ని మార్గాలను బారికేట్లతో మూసివేసి పక్క దేశం వెళ్లినట్లుగా మార్చారని పేర్కొంది. రుషికొండ ప్రాంతం పూర్తి నిషిద్ద ప్రాంతంలో ఉందా లేక పాకిస్తాన్ లో ఉందా అన్నట్లుగా పోలీసులు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నట్లుగా అనిపించలేదని జనసేన విమర్శించింది.

YS Sharmila: ఢిల్లీలో వైఎస్ షర్మిల .. విలీనంపై కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు..?


Share
Advertisements

Related posts

గోషామహల్ నుండి పోటీ .. రాహుల్ సిప్లిగంజ్ ఇచ్చిన క్లారిటీ ఇది

somaraju sharma

Siddharth: ‘బొమ్మరిల్లు’తో భారీ హిట్ అందుకున్న సిద్దార్థ్ కెరీర్‌లో నాశనం అవడానికి కారణం ఆ రెండు సినిమాలేనా..?

GRK

బ్రేకింగ్ : ఏపీ లో ఆరోగ్య పండగ – కొత్త అంబులెన్స్ లని మొదలు పెట్టిన జగన్

arun kanna