NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ ను కాపీ కొట్టేయ్ జ‌గ‌న్ … ప‌వ‌న్ ఉచిత స‌ల‌హా !

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ను కాపీ కొట్టాల‌ని ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓ కీల‌క సూచ‌న చేశారు. అదే స‌మ‌యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ పై కామెంట్ సైతం చేశారు.

కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. ‘‘ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఇ.డబ్య్యు.ఎస్.లకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి. ఇడబ్ల్యుఎస్ తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి’’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ప‌వ‌న్ కీల‌క కామెంట్లు …

తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమ‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చూపించిన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈడబ్య్లూఎస్ 10 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరుకుంటున్నానని ప‌వ‌న్ పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ అమలు చేయడం వల్ల విద్యా, ఉపాధి అవకాశాలు మరింత మెరుగై ఆ వర్గాల్లో ఉపశమనం లభిస్తుందని ఆయ‌న విశ్లేషించారు. “కాపు రిజర్వేషన్ కు మీరు ఎలాగూ వ్యతిరేకం కాబట్టి ఈ విధంగానైనా ఈడబ్య్లూఎస్ అమలు చేస్తే అగ్రవర్ణ పేదలకు కాస్త ఊరట లభిస్తుంది.“ అంటూ ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ని ఎత్తిపొడిచే ప్ర‌య‌త్నం చేశారు. కేసీఆర్ స్ఫూర్తితో జగన్ రెడ్డి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలని కోర‌డమే కాకుండా కాపుల గురించి కామెంట్ చేయ‌డంపై జ‌గ‌న్ టీం ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సింది.

author avatar
sridhar

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju