Polavaram Project: పోలవరంపై అసలు విలన్ ఎవరు..? పోలవరం పొలిటికల్ శాపం..!!

Share

Polavaram Project:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు నిజానికి వరం. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే అటు తూర్పు గోదావరితో పాటు విశాఖపట్నం వరకూ, ఇటు వైపు పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు శశ్యస్యామలం అవుతాయి. దాదాపు ఆరు జిల్లాల్లో 40 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు అందడంతో పాటు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే దానికి అనుబంధంగా ఉప కాలువల ద్వారా పలు ప్రాంతాలకు నీళ్లు పంపే అవకాశం ఉంటుంది. కానీ ఈ ప్రాజెక్టు పూర్తి కావడం లేదు. పోలవరానికి రాజకీయ శాపంగా మారింది. రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టులు ఏ రకంగా వాడుకున్నాయి ? ప్రస్తుత బీజేపీ దీన్ని ఏ రకంగా వాడుకుంటుంది ? అనే విషయాలను పరిశీలిస్తే… 2014 ఎన్నికలకు ముందు బీజేపీ, తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకున్న సమయంలో పోలవరం ప్రాజెక్టును పూర్తి స్తామని ఈ రెండు పార్టీలు హామీ ఇచ్చాయి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పనుల టెండర్లు, నిర్మాణ బాధ్యతలను కేంద్రమే చేసి ఉన్నట్లయితే వేరుగా ఉండేది కానీ 2014లో రాష్టంలో అధికారంలోకి వచ్చిన  టీడీపీ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీతో ఉన్న ఒప్పందాల కారణంగా టెండర్ల నిర్వహణతో పాటు ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. పనులు చేపడుతూ కేంద్రాన్ని నిధులు అడిగింది. అయితే కేంద్రం కొంత నిధులు ఇచ్చి కొన్ని నిధులను ఆపింది. పనులు ఆలస్యం కావడంతో పాటు పెరిగిన ధరల నేపథ్యంలో  ప్రాజెక్టు అంచన వ్యయాలు భారీగా పెరిగాయి. రూ.55,560 కోట్లకు పెరిగింది. ఇది పెరిగిన ధరలకు అనుగుణంగా 2018లో ఆమోదించిన అంచనా వ్యయం.

 

Read more: Polavaram project: జగన్ ప్రభుత్వం ఓడింది..! పోలవరం 2022 చివరికీ అసాధ్యమే..?

Polavaram Project:  పోలవరం ప్రాజెక్టులో బీజేపీ ద్వంద వైఖరి

ఇప్పుడు 2021 డిసెంబర్ వచ్చేసింది. మళ్లీ పెరిగిన ధరలకు అనుగుణంగా అంచనాలు సిద్దం చేస్తే 60 వేల కోట్లకు దాటే అవకాశం ఉంది. పునరావాసం, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం పంపిణీ చేయాలి. కేంద్రం పునరావాసానికి సంబంధించి ఇంత వరకూ నిధులు ఇవ్వలేదు. ఇప్పట్లో ఇస్తుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్రం నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అంటే.. రాష్ట్రంలో బీజేపీ ఎదగాలి అనుకుంటోంది. కానీ రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు లేవు, సీట్లు లేవు. వాస్తవానికి వాళ్లకు ఓట్లు రావు, సీట్లు రావు. ఆ పరిస్థితి కారణం ఆ పార్టీనే. రాష్ట్రంలో పార్టీ ఎదగాలి అనుకున్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా నిలుపుదల చేసి అది తమ వల్లనే సాధ్యపడిందని బీజేపీ చెప్పుకుంటే ఆ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అలా రాష్ట్ర బీజేపీ చేయడం లేదు. తరువాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుండి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పించి తామే పూర్తి చేస్తామని కేంద్రం బాధ్యత తీసుకోవాలి. ఇది జాతీయ ప్రాజెక్టు అయినందున కేంద్రంద ద్వారా  పూర్తి చేయించి ఆ క్రెడిట్ ను తామే తీసుకునేలా ఏపీ బీజేపీ నేతలు వ్యవహరించాలి. కానీ అలా చేయడం లేదు. ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఇక్కడ రాజకీయం చేయడం చేతగావు. అందుకే కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇతర పార్టీలపై ఆధారపడుతుంటారు. గతంలో టీడీపీతో అధారపడ్డారు. టీడీపీకి స్వేచ్చను ఇచ్చారు. చివరలో బిల్లులు ఇవ్వకుండా దెబ్బేశారు. ఇప్పుడు వైసీపీపై ఆధారపడి వాళ్లకు స్వేచ్చను ఇచ్చారు. ఇప్పుడు కూడా తాము డబ్బులు ఇవ్వము, పాత అంచనాల ప్రకారం ఇచ్చేశాము, ఇస్తాము అని చెబుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రంలోని బీజేపీ ద్వంద వైఖరి అవలంబిస్తోంది.

 

బీజేపీకి ఎదిగే అవకాశం ఉన్నా..

ఓ పక్క మీరే టెండర్లు ఫైనల్ చేసుకోండి, మీరే ప్రాజెక్టు కట్టండి, మేము నిధులు ఇస్తాము అంటూ స్వేచ్చను ఇస్తూ నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఒక వేళ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ క్రిడిట్ వైసీపీకో, టీడీపీకి వస్తుంది కానీ బీజేపీకి రాదు. బీజేపీకి ఆ క్రెడిట్ తీసుకుని రాజకీయంగా ప్రయోజనం పొందేంత సీన్ లేదు. వాళ్లకు రాజకీయం చేతకాదు. వేరే వాళ్లకు ఆ క్రెడిట్ ఇవ్వదు. వాస్తవానికి ఏపిలో బీజేపీకి ఎదిగే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ఆ క్రెడిట్ ను వాళ్ల ఖాతాలోకి వేసుకుని రాజకీయంగా లబ్దిపొందవచ్చు. అదే విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆపేయించి అక్కడ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి మా వల్లే ఆగిందని ప్రచారం చేసుకుంటే ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేసి తామే పూర్తి చేశామని చెప్పుకుంటే బీజేపీకి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓట్లు రావచ్చు కూడా. కానీ అలా చేయడం లేదు. అందుకే పోలవరం ప్రాజెక్టుకు విలన్ కేంద్ర ప్రభుత్వం. బీజేపీ పార్టీయేనని స్పష్టంగా చెప్పవచ్చు. మరో పక్క ఈ ప్రాజెక్టు విషయంలో వైసీపీ నిర్లక్ష్యం కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి అని కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదు. ఒత్తిడి చేయడం లేదు. అటు పార్లమెంట్ లో, రాజ్యసభలో మా రాష్ట్రంలో జాతీయ ప్రాజెక్టు ఉంది, వాటికి నిధులు ఇవ్వండి అని గట్టిగా కోరాలి. కేంద్రాన్ని గట్టి గా అడగడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల గురించి కేంద్రంతో ఫైట్ చేయకుండా కేంద్రంలో బీజేపీ సర్కార్ కు మద్దతు ఇస్తూ ఉంది. రాజ్యసభలో కేంద్రంలోని బీజేపీకి వైసీపీ సహకరిస్తూ ఉంది. రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ .. కేంద్రంలోని బీజేపీతో ఇలా వ్యవహరిస్తున్నంత కాలం ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వదు.


Share

Related posts

Lovers Suicide: కృష్ణాజిల్లాలో విషాదం ..ప్రేమికుల ఆత్మహత్య

Srinivas Manem

అరేయ్ బాబు నేను కలెక్టర్ ని : రాష్ట్రపతి పర్యటలో ఓవర్ యాక్షన్

Special Bureau

మంచు విష్ణు పాన్ ఇండియన్ సినిమా మోసగాళ్ళు రిలీజ్ డేట్ ఫిక్స్ ..!

GRK