Police: శ‌భాష్ తెలంగాణ పోలీసులు… ఇలాంటివి ఇప్పుడు అవ‌స‌రం

Share

Police: ఓవైపు క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగుతుంటే మ‌రోవైపు కొంద‌రి అరాచ‌కాలు అదే రీతిలో సాగుతున్నాయి. ముఖ్యంగా ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు బ్లాక్ లో అమ్మ‌డం, రెమ్డిసివిర్ పొంద‌కుండా బ్లాక్ లో ఉంచ‌డం ఇందులో భాగం. అయితే, ఈ ఉదంతంలో తాజాగా హైద‌రాబాద్ రాచకొండ పోలీసులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ ల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరు చెప్పి అక్రమ వ్యాపారం చేస్తున్న కొందరు దుండగుల ఆట క‌ట్టించారు.

పేరు ఫౌండేష‌న్ చేసేది త‌ప్పుడు ప‌నులు…

మాస్ ఫౌండేషన్ ఎన్జీవో పేరుతో తక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్ ను తీసుకొని అవ‌స‌రంలో ఉన్న వారికి ఎక్కువ మొత్తానికి సిలిండర్లు అమ్ముకుంటున్న విష‌యం పోలీసుల‌కు తెలిసింది. పక్కా సమాచారంతో ముగ్గురు సభ్యుల ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా దగ్గర నుంచి 120 కిలోల ఐదు సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. క‌రోనా స‌మ‌యంలో ఇలాంటి అక్ర‌మాలు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.

వీరిది ఇంకో దందా…
నుమతులు లేకుండా కరోనా రోగులకు ఎక్కువ ధరకు ఆక్సిజన్ సిలిండర్లు సప్లై చేస్తున్న ముఠా మల్కాజిగిరి పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ అబ్దుల్, మొహమ్మద్ మజార్, ఆసీఫ్ ఎన్జీఓ పేరుతో అక్రమ దందాకు తెరలేపారు. మౌలాలిలో మారుతీ వ్యాన్ లో తరలిస్తుండగా ఎస్ఓ టి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో సిలిండర్ ని 25 వేలకు ఇస్తున్నట్లు గుర్తించారు. నిందితుల వద్ద 5 ఆక్సిజన్ సిలిండర్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Share

Related posts

Pawan Kalyan : బీజేపీ స్ట్రాటజీ అదేనా..? పవన్ పై సీఎం కార్డు అందులో భాగమేనా..!?

Muraliak

Ys Jagan : మంత్రి కొడాలి నాని కి సరికొత్త బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్..!!

sekhar

vizag steel plant విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగబోదన్న కేంద్రం !ఏపీ ప్రభుత్వానికి సంబంధమే లేదని స్పష్టీకరణ!

Yandamuri