Rain alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. నైరుతి రుతుపవనాలకు ఉపరితల ఆవర్తన ద్రోణి తోడవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్ని చోట్ల పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వానలు కురస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ .. ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడుతున్నాయని తెలిపింది. నంద్యాల జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా పంటలు నీట మునిగాయి. మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

జూలై 6న చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, గుంటురు, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడనున్నాయి. జూలై 7న ప్రకాశం, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. జూలై 8న కర్నూలు, నంద్యాల, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది.
రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేలు వీరే