పవన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించి విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఆ భేటీపై స్పందిస్తూ చేసిన ట్వీట్ జనసేన, టీడీపీ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించినట్లుగా ఉంది. ఆర్జీవీకి రాజకీయాలతో సంబంధం లేకపోయినా రాజకీయ నేపథ్య కథాంశాలతో సినిమాలు తీస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనకు వ్యతిరేకంగా, వైఎస్ జగన్ కు అనుకూలంగా ఉండే ఆర్జీవీ.. చంద్రబాబు, పవన్ భేటీపై స్పందిస్తూ తనదైన శైలిలో విమర్శించారు. “కేవలం డబ్బు కోసమే తన సొంత కాపున్ని కమ్మోళ్లకు అమ్మేస్తాడని ఊహించలేదు. RIP కాపులు. కంగ్రాచులేషన్స్ కమ్మోళ్లు” అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా విమర్శించారు. వర్మ ట్వీట్ ఓ పక్క సినీ వర్గాల్లో, మరో పక్క రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపింది.
ఆర్జీవీ ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు, కొందరు కాపు సామాజికవర్గానికి చెందిన వారు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, మరో పక్క రాజకీయ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి కామెంట్స్ చేయడమే కాక ఒక సామాజికవర్గాన్ని చులకన చేసేలా ఆర్జీవీ ట్వీట్ చేయడంతో ఆయనపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. వర్మను ఏకవచనంతో సంభోదిస్తూ బండ బూతులు తిడుతున్నారు. ఆర్జీవీ తన కామెంట్స్ ను వెనక్కు తీసుకోవాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. కత్తి మహేష్ లేని లోటు తీరుస్తున్నాడు అంటూ బూతులతో నెటిజన్లు వారికి ఇష్టమొచ్చిన రీతిలో ఆర్జీవీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు.
మరో పక్పక వన్ కళ్యాణ్, చంద్రబాబు భేటీ అంశం ఏపి రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాబోయే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని కూడా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కోసమే పవన్ కళ్యాణ్ పని చేస్తున్నాడంటూ వైసీపీ విమర్శిస్తొంది. వీరి భేటీ అంశాన్ని రెండు కులాలకు ముడిపెడుతూ ఆర్జీవీ పోస్టు పెట్టడంతో వారు ఆయనపై మండిపడుతున్నారు.
తెరపైకి మేకపాటి శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి .. ఉదయగిరి ఎమ్మెల్యే కుటుంబంలో కొనసాగుతున్న వివాదం
కేవలం డబ్బు కోసం తన సొంత కాపుల్ని ,కమ్మోళ్లకి అమ్మేస్తాడని ఊహించలేదు ..RIP కాపులు , కాంగ్రాట్యులేషన్స్ కమ్మోళ్ళు 😔😔😔
— Ram Gopal Varma (@RGVzoomin) January 8, 2023
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!