Vijayawada: విజయవాడ నగరంలోని బీఆర్‌టీఎస్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వేగంగా వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు సెన్సార్ బ్లాక్ అవ్వడంతో కారును వదిలి పరారయ్యారు.
Advertisements

ప్రమాదం జరిగిన సమయంలో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అనుచరుడు కారు నడిపినట్లుగా తెలుస్తొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారును గుణదల పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisements
Advertisements