NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: మరల సొంత గూటికి చేరిన బొమ్మిరెడ్డి .. నెల్లూరులో టీడీపీకి షాక్

TDP leader Bommireddy Raghavendra Reddy joined ysrcp

YSRCP: నెల్లూరు జిల్లాలో రాజకీయాలు మారో సారి హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంపై నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అనం రామనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను వైసీపీ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు రూరల్ కు ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డి ని నియోజకవర్గ సమన్వయకర్తగా వైసీపీ నియమించగా, ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరికి నెదురుమల్లి రాంకుమార్ రెడ్డిని ఇన్ చార్జిగా నియమించారు. ఇక మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉదయగిరి నియోకవర్గానికి ఇంత వరకూ వైసీపీ ఇన్ చార్జిని నియమించలేదు.

TDP leader Bommireddy Raghavendra Reddy joined ysrcp
TDP leader Bommireddy Raghavendra Reddy joined ysrcp

 

జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను బయటకు పంపిన నేపథ్యంలో వారి ద్వారా జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు వైసీపీ సిద్దమైంది. ఈ క్రమంలో టీడీపీ లో అసంతృప్తిగా ఉన్న నేతలపై వైసీపీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతోంది. ఆ ఫలితంగా గత ఎన్నికల ముందు వైసీపీ నుండి టీడీపీలో చేరిన మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చర్చలు జరపడంతో అవి సఫలం అయ్యాయి. శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో పాటు  ఆత్మకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, టీడీపీ నేత ఇందూరు వెంకట రమణారెడ్డిలు వైసీపీలో చేరారు. వీరికి జగన్మోహనరెడ్డి పార్టీ కండువాలు కప్పిసాదరంగా ఆహ్వానించారు.

బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి 2019 ఎన్నికలకు ముందు వెంకటగిరి వైసీపీ ఇన్ చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే నాడు కాంగ్రెస్ పార్టీ నుండి వైసీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో అలిగిన బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో ఆత్మకూరు టికెట్ ను ఆశించారు. పార్టీ అధిష్టానం నుండి స్పష్టమైన హామీ లభించలేదు. దీంతో కొంత కాలంగా టీడీపీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డితో చర్చించడంతో నేడు వైసీపీలో చేరారు.

అయితే బొమ్మిరెడ్డికి వెంకటగిరి లేదా ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆశిస్తున్నారు. వైసీపీ ఆయనకు ఆ సీటు హామీ ఇచ్చింది అనేది ఇంకా వెల్లడి కాలేదు. ఒక వేళ ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిని ఉదయగిరికి పంపితే ఆయన స్థానంలో బొమ్మిరెడ్డికి అవకాశం లభిస్తుంది. లేదా వెంకటగిరి ఇన్ చార్జి నెదురుమల్లి రామ్ కుమర్ ను పక్కన పెట్టి బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఈ మాజీ జడ్పీ చైర్మన్ కల నెరవేరుతుందా లేదా అనేది తెలియాలి అంటే కొద్ది నెలలు ఆగాల్సిందే.

YS Viveka Murder Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju