NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి డిసైడ్ .. రాజీనామాపై మరో ట్విస్ట్..!!

Divyavani: టీడీపీ అధికార ప్రతినిధి, సినీనటి దివ్యవాణి ఆ పార్టీకి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారు. పార్టీని వీడుతున్నట్లు మరో సారి స్పష్టం చేశారు దివ్యవాణి. గత రెండు రోజులుగా దివ్యవాణి రాజీనామా ఏపిసోడ్ ఏపి రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మనస్థాపానికి గురైన దివ్యవాణి రెండు రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా వచ్చిన సోషల్ మీడియాలో పోస్ట్ తో ఆమె తీవ్రంగా హార్ట్ అయ్యారు. ఆ వెంటనే పార్టీలో కొన్ని దుష్టశక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తున్నానని, పార్టీకి రాజీనామా చేస్తున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ నేపథ్యంలో పార్టీ నాయకుడు బచ్చుల అర్జునుడు దివ్యవాణితో మాట్లాడి అది ఫేక్ పోస్టు అని తెలియజేయడంతో రాజీనామా విషయంలో యూటర్న్ తీసుకున్నారు. తన రాజీనామా ట్వీట్ ను తొలగించారు.

TDP Spokesperson Divyavani Selfie video on Resignation
TDP Spokesperson Divyavani Selfie video on Resignation

Divyavani: అయిదు గంటలకు పైగా వేచి ఉండి

అయితే పార్టీ అధినేత చంద్రబాబును కలిసి పార్టీలో తనకు జరుగుతున్న అవమానాలను వివరించాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబుతో దివ్యవాణి భేటీ తరువాత రాజీనామా అంశంపై శుభం కార్డు పడుతుందని ఆ పార్టీ శ్రేణులు అనుకుంటున్న తరుణంలో బుధవారం రాత్రి సెల్పీ వీడియో విడుదల చేసి సంచలనం సృష్టించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ భవన్ లో టీడీపీ అధినేత చంద్రబాబుతో నిన్న రాత్రి భేటీ అయ్యారు. ఆ సమావేశం నుండి బయటకు వచ్చిన తరువాత కొద్ది సేపటికే సంచలన వ్యాఖ్యలు చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. అక్కడ నాకు అందిన మర్యాదను తట్టుకోలేకపోయా, అక్కడి యదార్ధతను చూడలేకే తాను టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు దివ్యవాణి. తనను ఇంత వరకూ ఆదరించిన టీడీపీ పెద్దలను దేవుడు బహుగా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీ కార్యాలయంలో చంద్రబాబును కలిసేందుకు దివ్యవాణి దాదాపు అయిదు గంటల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఆమె పార్టీ కార్యాలయానికి చేరుకోగా చంద్రబాబును కలిసేందుకు రాత్రి 7.45 తరువాత అపాయింట్మెంట్ లభించింది.

Read More: YSRCP: పార్టీలో క్రమశిక్షణ మీరితే ఏ స్థాయి వ్యక్తిపై అయినా ‘వేటు’ ఖాయం..మాజీ మంత్రి కొత్తపల్లిపై జగన్ మార్క్ ‘దెబ్బ’..!!

 

వాళ్ల మర్యాదలు తట్టుకోలేక

దీనిపైనా తీవ్రంగా హార్ట్ అయిన దివ్యవాణి .. “లోపల ఏమి జరిగింది..? సార్ నేను ఏం మాట్లాడాము.? అనేది గురువారం ఉదయం మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను. వాళ్ల మర్యాదను తట్టుకోలేక, అక్కడ యదార్థతను చూడలేక నేను టీడీపీకి రాజీనామా చేయబోతున్నా. నన్ను ఇంత వరకూ ఆదరించిన టీడీపీ పెద్దలను, లోపలున్న వాళ్లందరినీ దేవుడు బహుగా ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. పూర్తి వివరాలు రేపు (గురువారం) చెబుతా..అర్ధమైందిగా” అంటూ సెల్పీ వీడియోలో పేర్కొన్నారు దివ్యవాణి. దివ్యవాణి ఇచ్చిన ఈ ట్విస్ట్ తో ఈ రోజు నిర్వహించే మీడియా సమావేశంలో ఇంకా ఎటువంటి సంచలన అంశాలపై మాట్లాడతారు..? టీడీపీలో ఎవరిపై ఆరోపణలు, విమర్శలు సంధిస్తారు..?  అనేది ఆసక్తికరంగా మారింది. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన దివ్యవాణి పార్టీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించి ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా పేరుతెచ్చుకున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N