NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పల్నాడు లో తీవ్ర ఉద్రిక్తత .. గాలిలోకి కాల్పులు జరిపిన వినుకొండ సీఐ

TDP YCP Clash CI Fires on air in Vinukonda Palnadu Dist

పల్నాడు జిల్లా వినుకొండలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ వర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లు చేసుకోవడంతో అక్కడి రాజకీయం వేడెక్కింది. రాళ్లు, కర్రలతో దాడి చేసుకోవడంతో వినుకొండ ఆర్టీసీ బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎంత ప్రయత్నించినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ కార్యకర్తలు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వద్దకు రాగానే వారికి వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు ఎదురుపడ్డారు. మట్టి తవ్వకాలపై చర్చకు సిద్దమంటూ తన వాహనం దిగి టీడీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. గనుల అక్రమ తవ్వకాలు చేపట్టారంటూ బ్రహ్మనాయుడుకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

TDP YCP Clash CI Fires on air in Vinukonda Palnadu Dist
TDP YCP Clash CI Fires on air in Vinukonda Palnadu Dist

ఈ క్రమంలో టీడీపీ శ్రేణులను అక్కడి నుండి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. దీంతో పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పట్టణ సీఐ సాంబశివరావు గాల్లోకి కాల్పులు జరిపారు. టీడీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జి చేశారు. తమ నేతపై తప్పుడు కేసులు పెట్టారని, దీన్ని నిరసిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేపడితే అడ్డుకుంటారా అని టీడీపీ కార్యకర్తలు నిలదీస్తున్నారు. సమాచారం అందుకున్న జీవీ ఆంజనేయులు బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తొంది. ఎమ్మెల్యే గన్ మెన్ కు గాయాలు కావడంతో పాటు ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.

అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ తాను జగనన్న సురక్ష కార్యక్రమానికి వెళుతుంటే  టీడీపీ నేతలు దాడికి దిగి కారుపై రాళ్లు విసిరారన్నారు. కావాలనే వారు ప్లాన్ ప్రకారం తనపై దాడి చేశారని ఆరోపించారు. తనపై భౌతికంగా దాడి చేయాలని ప్లాన్ చేశారన్నారు. టీడీపీ కుట్రలను తాము తిప్పి కొడతామనీ, ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తానన్నారు. రెండు రోజుల క్రితం తన డెయిరీ ఫామ్ ను ధ్వంసం చేశారన్నారు. ఇక్కడ జీవీ ఆంజనేయులు వంటి చెత్త నేతలు ఉన్నారనీ, ప్రజల తిరుగుబాటుతో తోక ముడిచారన్నారు. జీవి ఆంజనేయులుకి ప్రజాభిమానం లేదని అన్నారు. గ్రామాల్లో అలజడి సృష్టించాలని టీడీపీ కుట్రలు చేస్తొందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు.

Heavy Rains: వరద బీభత్సంతో నీట మునిగిన గ్రామాలు.. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతు  

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju