NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపిలో మరో ఘటన..! విగ్రహం మాయం..! ఎక్కడంటే..?

 

ఏపిలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన  ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఆలయంలో విగ్రహాన్నే మాయం చేశారు.

కడప జిల్లా వేముల మండలం చాగరేవు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికలు సమాచారంతో ఎస్ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

ఇప్పటికే విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై బీజెపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తోంది. దేవాలయాలపై ఘటనలను పురస్కరించుకుని ప్రభుత్వంపై బీజెపీ, హిందూ సంఘాలు, టీడీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుండగా ప్రభుత్వం కూడా ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్నది. ఆలయాలపై దాడుల వ్యవహరంలో కుట్ర కోణం దాగి ఉందని ఇప్పటికే ప్రభుత్వం, పోలీసు యంత్రాగం ప్రాధమిక అంచనాకు వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా దీనిపై సీరియస్ తీసుకున్నారు. రాష్ట్రంలో మత విధ్వేషాలను రెచ్చగొట్టే కుట్రలో భాగంగా ఇవి చేస్తున్నారనేది ప్రభుత్వం భావిస్తున్నది. దేశ వ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో రాష్ట్రం దూసుకువెళుతున్న క్రమంలో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అధికారులు, వివిధ మతాలకు చెందిన ప్రతినిధులతో మతసామరస్య కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju