NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Viral Video: లైవ్ లో భర్త కళ్లెదుటే ఉరేసుకుని చనిపోయిన భార్య..! వీడియో తీసిన పైశాచిక భర్త..!!

Viral Video: నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఈ ఘటన చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేస్తుంది. సమాజంలో ఇటువంటి శాడిస్టులు ఉంటారా, కళ్ల ముందే కట్టుకున్న భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే వారించాల్సింది పోయి ఏదో పోటీలో పాల్గొంటున్న భార్యను ఎంకరేజ్ చేసినట్లు ఆమె ఫ్యాన్ కు ఉరి వేసుకుంటుంటే వేసుకో, వేసుకో అంటూ తన సెల్ ఫోన్‌తో ఆమె మరణాన్ని చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందడం చూపరుల హృదయాలను కలచివేస్తున్నాయి. ఆమె ఉరివేసుకుని కళ్ళ ముందే ఊపిరి ఆడక మృతి చెందుతుంటే మానవత్వం అనేది లేకుండా ప్రవర్తించాడు ఆమె భర్త. ఆమె ఆత్మహత్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్ లు ఆమె భర్త ప్రవర్తనపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: Nellore district husband captures wife suicide video
Viral Video Nellore district husband captures wife suicide video

వివరాల్లోకి వెళితే..నెల్లూరు జిల్లా ఆత్మకూరు జగన్నాధరావుపేటలో ఉంటున్న పెంచలయ్యకు పదేళ్ల క్రితం ఆనంతసాగరం మండలం కొత్తపల్లికి చెందిన కొండమ్మ (31)తో వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెంచలయ్య ఓ ప్రైవేటు బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తుండగా భార్య కొండమ్మ ఆత్మకూరు మెప్మాలో రిసోర్స్ పర్సన్ గా పని చేస్తోంది. ఇటీవల భార్యపై అనుమానం పెంచుకున్న పెంచలయ్య ఆమెను వేధించడం ప్రారంభించాడు. దీంతో ఆమె తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. భర్త కళ్లెదుటే ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకునేందుకు సిద్ధమైంది.

ముక్కు మొహం తెలియని వారు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటుంటేనే మానవత్వంతో ఆపేందుకు ఎవరైనా ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ స్వయంగా ఆమె భర్త చూస్తూ కూడా  ఉరి వేసుకుంటున్న ఆమెను వారించాల్సింది పోయి “వేసుకో వేసుకో, నేను ముట్టుకోను, మీ అన్నయ్యలు వస్తారో, పోలీసులు వస్తారో చూస్తాను” అంటూ సినిమా చూసినట్లు చూస్తూ మొత్తం తన సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందం పొందాడు. భర్త ఆమె బలవన్మరణాన్ని ఆపకపోవడంతో ఉరి బిగుసుకొని కొండమ్మ ప్రాణాలు విడిచింది. ఈ వీడియోను పెంచలయ్య భార్య బంధువులకు పంపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు  పెంచలయ్యను అరెస్టు చేసి కోర్టుకు హజరుపర్చారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N