NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనంలో ఉన్న వారికే ఎన్నికల్లో సీట్లు .. మరో సారి స్పష్టం చేసిన వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్

ఎన్నికల్లో సీట్లు కావాలంటే జనంలో ఉండాల్సిందేనని మరో సారి స్పష్టం చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిలతో బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో వర్క్ షాప్ నిర్వహించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహణ తీరుపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించని ఎమ్మెల్యేలకు సున్నితంగా క్లాస్ పీకినట్లు సమాచారం. ఎన్నికల వరకూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందేనని జగన్ సూచించారు. సమావేశం ముగిసిన తర్వాత వివరాలను మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

AP CM YS Jagan

 

2024 ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు విజయమే లక్ష్యంగా పార్టీ నేతలు కృషి చేయాలని జగన్ దిశా నిర్దేశం చేశారని పేర్ని తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో 27 మంది పని తీరు బాాగా లేదనీ జగన్ పేర్కొన్నారనీ, వీరు వచ్చే సమావేశం నాటికి తమ పని తీరు మెరుగుపర్చుకోవాలని ఆదేశించారన్నారు. సమావేశంలో వారి పేర్లు మాత్రం వెల్లడించలేదనీ, పేర్లు వెల్లడిస్తే వారిని తక్కువ చేసినట్లు అవుతుందన్న కారణంగా జగన్ పని తీరు బాగాలేని నేతల పేర్లు వెల్లడించలేదని తెలిపారు.నవంబర్ నెలలో మరో సారి గడపగడపకుపై సమావేశం ఏర్పాటు చేస్తామనీ, అప్పటి లోగా పని తీరు బాగోలేని వారు పని తీరు మెరుగుపర్చుకోవాలని జగన్ సూచించారన్నారు.

YSRCP

 

ఎవరి పనితీరు బాగా లేదో వారికే ఈ విషయం బాగా తెలుసునని జగన్ అన్నారన్నారు. పని తీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు కేటాయించనున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయాన్ని జగన్ మరో సారి గుర్తు చేశారని పేర్ని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే టికెట్ల కేటాయింపుపై నిర్ణయం తీసుకుంటానని జగన్ చెప్పారని వెల్లడించారు. ఎన్నికల నాటికి పని తీరు మెరుగుపర్చుకోని వారికి టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారన్నారు. రాజకీయాలను పార్ట్ టైమ్ గా తీసుకునే వారికి అవకాశాలు ఇవ్వలేమని కూడా జగన్ చెప్పారన్నారు పేర్ని నాని.

రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!