NewsOrbit
Featured బిగ్ స్టోరీ

AP By Elections: అప్పుడు నంద్యాల – ఇప్పుడు తిరుపతి.. ఎన్నికల్లో వైపరీత్యాలు..!!

YSRCP vs BJP: Tirupathi By Election Petition in Highcourt

AP By Elections: మనం మొన్ననే ఒక కథనంలో చెప్పుకున్నాం.. తిరుపతి ఎన్నిక పోలింగ్ కి ముందు ఓ స్పష్టమైన కథనంలో 2017 నంద్యాల ఉప ఎన్నికకు.. 2021 తిరుపతి ఎంపీ ఉన్న ఎన్నికకు పోలిక, సారూప్యత వివరించాం.. ఇప్పుడు ఈ కథనంలో తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ రోజు జరిగిన వివాదాలు.., దొంగ ఓట్లు బాగోతంలో నిజాలు.. నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్ రోజు ఏం జరిగింది..!? మొత్తం కాస్త లోతుగా చర్చిద్దాం..!

AP By Elections: ముందు మాట – తిరుపతిలో ఏం జరిగింది..!?

ఎస్… తిరుపతిలో ఉప ఎన్నిక సందర్భంగా దొంగ ఓట్లు పోలయ్యాయి. ఎన్ని ఓట్లు అనేది చెప్పలేం.. ఎన్ని వేలు ఓట్లు అనేది తేల్చలేం.. కానీ బోగస్ ఓట్లు పడడం మాత్రం ఖాయంగా పేర్కొనవచ్చు. అందుకు అనేక ఆధారాలు, సాక్ష్యాలు కూడా సోషల్ మీడియాలో వెలుగు చూశాయి. ఫేక్ ఐడెంటిటీ కార్డులు.. ఫేక్ ఓటరు స్లిప్పులు.. ఫేక్ పేర్లు పెట్టుకుని వచ్చేసారు. అక్కడి వరకు ఒకే. బీజేపీ/ టీడీపీ వారి అనుకూల మీడియాలు కూడా ఆ దొంగ ఓట్ల భరతం పట్టడంలో కొంతమేరకు సఫలీకృతమయ్యాయి. ఇది వైసీపీ ఆత్మహత్యా సదృశ్యమే. నిజానికి తిరుపతి ఉప ఎన్నిక స్వేచ్ఛగా.. ఎటువంటి పొరపాట్లు, ఇటువంటి ఘోరాలు లేకుండా జరిగితేనే వైసిపికి భారీ మెజారిటీ వస్తుంది. ఈజీగా రెండు లక్షలు మెజారిటీ వచ్చేది. కానీ ఎందుకో ఇలా ప్రయత్నాలు చేసింది. ఏం సాధిద్దామనో ఇలా తప్పులకు దొరికేసింది..! ఇది వైసీపీ చేసింది.. కానీ టీడీపీ అనుకూల మీడియా మరింత ఓవర్ యాక్షన్ చేసింది. సాధారణ పౌరులను కూడా దొంగ ఓటర్లు అనేలా అనుమానించి అతి భజన చేశారు. ఇక్కడితో అయిపోలేదు.. టీడీపీ మంచిదే అని భుజాలు చరుచుకుంటే పప్పులో కాలేసినట్టే.. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీ చేసిన అరాచకాలను ఒక సారి గుర్తు చేసుకోవాలి..!

read It ; నంద్యాల – తిరుపతి నిజాలు ఇద్దరూ గ్రహించాలి..!!

AP By Elections: 2017 Nandyal - 2021 Tirupathi Election Frauds
AP By Elections: 2017 Nandyal – 2021 Tirupathi Election Frauds

నంద్యాలలో బాబోరు చేసిందిదీ..!!

నంద్యాలలో 2017 లో ఉప ఎన్నిక జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. టీడీపీ.. వైసీపీ రెండూ గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి. నిజానికి అక్కడ వైసీపీ బలంగా ఉంది. కానీ అధికారంలో ఉన్నాం కాబట్టి.., గెలవాలని పట్టుదలతో దిగింది. భారీగా డబ్బులు వెదజల్లించి. టీడీపీ సుమారుగా రూ. 80 కోట్ల వరకు ఖర్చు చేసింది. ఒక్కో ఓటుకి కూడా 2 వేలు వరకు ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో ఓటుకి రూ. 3 , 4 వేలు కూడా ఇచ్చారు. భారీగా డబ్బు ఖర్చు చేసి.., ప్రతిపక్షాన్ని భయపెట్టి.. వైసీపీ నేతలను బెదిరించి.. లొంగదీసుకుని అప్పట్లో టీడీపీ పోల్ మేనేజ్మెంట్ భారీగా చేసింది. ఎన్నికల రోజు కూడా.. క్యూ లైన్లలో కూడా డబ్బులు ఇచ్చారు. పోలీసులు, అధికారులు, ఇతర జిల్లాల నాయకులను రంగంలోకి దించిన టీడీపీ … ఇన్ని ప్రయత్నాలతో 27 వేల ఆధిక్యతతో గెలిచింది. సో.. నంద్యాలలో జరిగిన దానికి ఒక అడుగు ముందుకేసి .. ఫేక్ ఓట్ల ద్వారా తిరుపతిలో వైసీపీ మరో సంస్కృతికి తెరతీసింది.

AP By Elections: 2017 Nandyal - 2021 Tirupathi Election Frauds
AP By Elections: 2017 Nandyal – 2021 Tirupathi Election Frauds

ఎన్నికల సంఘం ఏం చేస్తుంది..!?

ఎన్నికలు అంటే ప్రతిష్టాత్మకం.. గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తారు. ప్రచారాలు చేస్తారు. డబ్బులు పెడతారు. కానీ ఏపీలో దశలు దాటేస్తుంది. ఎన్నికల అక్రమాల్లో కొత్త పుంతలు తొక్కుతుంది. డబ్బులు విచ్చలవిడిగా పెడుతున్నారు. ఓట్లు నకిలీవి సృష్టిస్తున్నారు. అసలైన ఓటర్లు ఓటు వేయకముందే వారి ఓటు పోలైపోతుంది. డబ్బులు భారీగా ఖర్చు చేస్తున్నారు. ఇవన్నీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలే. బీహార్, యూపీ, పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతాల్లో డబ్బు ప్రభావం తక్కువ ఉంటుంది కానీ.. రిగ్గింగ్.. కిడ్నాప్ లు.. కొట్లాటలు, భారీ గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఏపీలో ఇవన్నిటితో పాటూ డబ్బు కూడా విచ్చలవిడిగా మారుతుంది. అంటే ఏపీలో సంకృతి మారిపోతుంది. ఎన్నికల్లో డబ్బు పంపిణీ విధానాన్ని ప్రవేశపెట్టిన చంద్రబాబు అదే విధానం జగన్ కూడా చేయడంతో దెబ్బ తిన్నారు.. ఇన్ని జరుగుతున్నా ఏపీలో.. ఇండియాలో ఎన్నికల సంఘం ఏం చేస్తుంది..? సోషల్ మీడియాలో వీడియోలు.., మీడియాలో ప్రసారాలు చూడడం.. వాటిని పట్టించుకోవడం మానేసినట్టుంది..!!

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju